టాలీవుడ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ చిత్రానికి సీక్వెల్‌గా హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్ . ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. థియేటర్లలో ఉస్తాద్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డబుల్ మాస్ మ్యాడ్‌నెస్‌ను ఎక్స్‌పీరియన్స్ చేసేందుకు కౌంట్‌డౌన్ షురూ అయింది. మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ.. కొత్త పోస్టర్ విడుదల చేశారు. రామ్ స్టైలిష్ గాగుల్స్ పెట్టుకొని గన్స్ మధ్య స్టైలిష్‌గా డబుల్ ఇస్మార్ట్ లుక్‌ను విడుదల చేయగా.. నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. వంద రోజుల్లో థియేటర్లలో సందడి అంటూ లాంఛ్ చేసిన లుక్ వైరల్ అవుతోంది. డబుల్ ఇస్మార్ట్‌లో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజరు దత్ విలన్‌గా నటిస్తున్నాడు. ఫస్ట్ పార్టుకు అదిరిపోయే మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ సీక్వెల్‌కు కూడా పనిచేస్తున్నట్టు .. పూరీ, మణిశర్మ, చార్మీతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ ఈ విషయాన్ని తెలియజేశాడు రామ్. ఇసార్ట్ శంకర్‌ను మించిన ఆల్బమ్ రెడీ అవుతుందని ఈ స్టిల్‌తో క్లారిటీ ఇచ్చేశాడు. ఇస్మార్ట్ ఈజ్ బ్యాక్.. ఈ సారి డబుల్ ఇంపాక్ట్.. అంటూ ఇప్పటికే శక్తిమంతమైన త్రిశూలం.. బ్యాక్ డ్రాప్‌లో మంటలు కనిపిస్తున్న లుక్‌ను విడుదల చేయగా.. ఈ సారి డబుల్ ఎంటర్‌టైన్ మెంట్ పక్కా అని చెప్పేస్తున్నాడు పూరీ జగన్నాథ్. రామ్ మరోవైపు పాపులర్ బ్యానర్ పీపుల్ విూడియా ఫ్యాక్టరీలో కూడా ఓ సినిమాకు గ్రీన్ సిగల్ ఇచ్చాడని తెలిసిందే. ఈ చిత్రాన్ని సప్త సాగరాలు ధాటి ఫేం రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా మెరువబోతుందని వార్తలు వస్తుండగా.. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
ఇవికూడా చదవండి
హెల్మెట్లో పాము.. అచ్చం ఆ కలర్‌లోనే ఉంది.. వీడియో వైరల్
కదులుతున్న రైలులో బోల్డ్ డ్యాన్స్… అందుకేనా రేట్లు పెంచేది వీడియో వైరల్
భర్త వ్యక్తిగత వివరాలు భార్యకు చెప్పాల్సిన అవసరం లేదు కర్ణాటక హై కోర్టు కీలక వ్యాఖ్యలు