తెలంగాణ అసెంబ్లీ ఫలితాల అనంతరం కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనే చర్చ ఎత్త పెద్దగా నడుస్తుందో అంతే స్థాయిలో తదుపరి ఐటీ శాఖమంత్రి ఎవరు అనేది అదే స్థాయిలో చర్చిస్తున్నారు. ఐటీ రంగం అభివృద్ధి కోసం కేటీఆర్ చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున ట్వీట్లు చేస్తున్నారు. తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అవుతారనేది కాదు.. కేటీఆర్‌కు సరిపోయే ఐటీ మినిస్టర్‌ను కాంగ్రెస్ తీసుకురాగలదా? అని చర్చించుకుంటున్నారు.. ‘ ఇప్పటివరకు మేం చూసిన బెస్ట్ ఐటీ మినిస్టర్ విూరే’.. ‘తెలంగాణ బెస్ట్ ఐటీ మినిస్టర్‌ను కోల్పోయింది’. అంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి కామెంట్లు పెడుతున్నారు. ఇకపై కేటీఆర్ ఐటీ మినిస్టర్ కాదని తెలిసి నా ఐటీ జాబ్‌కు రాజీనామా చేస్తున్నామని కొంతమంది ట్వీట్లు చేశారు.
— KTR (@KTRBRS) December 3, 2023
ఐటీ మినిస్టర్ అనే పదానికి కేటీఆర్ రోల్ మాడల్ అని.. విజినరీ నాయకత్వాన్ని మిస్సవుతున్నామని కామెంట్లు పెడుతున్నారు. హైదరాబాద్ ఇంతగా అభివృద్ధి చెందింది.. ఉద్యోగవకాశాలతో లక్షలాది మంది ఇక్కడ జీవిస్తున్నారంటే దానికి కారణం విూరేనంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్‌ను ట్రెండ్ సెట్టర్ అంటూ కొనియాడుతున్నారు. గతంలో ఐటిశాఖ మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు పనిచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ కేబినేట్ రేసులో ఆయన కూడా ఉన్నారు. అయితే తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో చాలామంది విద్యావంతులు ఉన్నారు. ఇందులో ఓ మంచి సమర్థుడిని ఎంచుకుంటే మంచిదన్న అబిప్రాయం కూడా వస్తోంది. మరి కొంతమంది కేటీఆర్ కాకపోతే ఇంకేవరు చేయలేరా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ట్వీట్లు రీ ట్వీట్లతో సోషల్ మీడియా హోరెత్తుతోంది.
ఐటీ మినిస్టర్ ఆయనకకపోతే ఎవ్వరు చేయలేరా?
కంప్యూటర్లు బంద్ అయినయా?
👆ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడిన ఒక టిక్‌టాక్ కుక్క ఎవడో సామ్రాట్ అంటా వానికి కొంతమంది పచ్చ కుక్కలు అంకితం.👇#KTR #FutureOfTelangana pic.twitter.com/dtx6ujyU03
— Venkat Goud 🇮🇳🇺🇸 (@VenkatBRSUSA) December 5, 2023
ఇవికూడా చదవండి
క’న్నీట’ చెన్నై .. హృదయవిదారక వీడియోలు