తెలంగాణ ప్ర‌జ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు: కేటీఆర్ ట్వీట్

దాదాపు ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన‌ట్టే. ఇందులో కాంగ్రెస్ పార్టీకి స్ప‌ష్ట‌మైన మెజారిటీ ల‌భించింది. కాంగ్రెస్ నాయ‌క‌త్వం, కార్య‌క‌ర్త‌లు సంబురాలు చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో కేటీఆర్ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. ఓట‌మిని అంగీక‌రించారు. వ‌రుస‌గా రెండు ప‌ర్యాయాలు అధికారం ఇచ్చిన తెలంగాణ ప్ర‌జ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ రోజు వ‌చ్చిన ఫ‌లితం గురించి బాధ‌ప‌డ‌లేదని ఎక్స్‌లో పేర్కొన్నారు. కానీ అది మాకు ఆశించిన స్థాయిలో లేక‌పోవ‌డంతో క‌చ్చితంగా నిరాశా చెందాను అని రాసుకొచ్చారు. కానీ దీనిని మేము ఒక దీనిని ఒక చాలెంజ్‌గా తీసుకుంటాము. తిరిగి పుంజుకుంటామ‌ని తెలిపారు. ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినంద‌న‌లు తెలిపారు. మీకు శుభం జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నాన‌ని ట్విట్ట‌ర్ (ఎక్స్‌)లో రాసుకొచ్చారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *