భారత రాష్ట్ర సమితికి ఇవే చివరి ఎన్నికలని, కేసీఆర్ శకం ముగిసిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలే మాత్రమే ఉంటాయన్నారు. ఏడాది క్రితం వరకు బీజేపీ చాలా బలంగా ఉందని తెలిపారు. ఈ సంవత్సరం లో కాంగ్రెస్ చాలా బలంగా తయారై అధికారంలోకి వచ్చిందని తెలిపారు. హుందాతనమైన భాష వస్తుందని, దాడుల సంస్కృతి ఇక ఉండదని భావిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణాలో స్వచ్చమైన రాజకీయాలు చేద్దామని హితవు పలికారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే ఉంటాయని జోస్యం చెప్పారు.
కేంద్రంలో బీజేపీయే అధికారంలో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు స్థానాలు గెలుచుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచిందని అది తన నియోజకవర్గంలోనూ ఎఫెక్ట్ చూపెట్టిందని చెప్పారు. తనపై గెలిచిన అభ్యర్థి రూ. 34 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. రేవంత్ కు శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి కింది స్థాయి నుండి వచ్చిన నాయకుడని చెప్పారు.
తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు: కేటీఆర్ ట్వీట్
దోమలను చంపే మెషన్ గన్ : వీడియో మీరు చూడండి
గెట్ రెడీ టూ సెలబ్రెట్ గాయిస్ 3.0 : కేటీఆర్ ఆసక్తికర ట్వీట్