కారు లోయలో పడి ఏడుగురు మృతి

జ‌మ్మూ కాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. మంగ‌ళ‌వారం జమ్మూ కశ్మీర్‌లోని గాందర్‌బల్‌ జిల్లా శ్రీనగర్‌- జాతీయ రహదారిపై జోజిలా పాస్‌ వద్ద కారు లోయలో పడింది. ఈఘ‌ట‌న‌లో ఏడుగురు టూరిస్టులు మృతి చెందారు. సమాచారం అందుకున్న సోనామార్గ్‌ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు అందించారు. ప్రమాద సమయంలో కారులో ఏడుగురు టూరిస్టులు, డ్రైవర్‌ ఉన్నారు. రోడ్డుపై దట్టమైన మంచు ఉండటంతో కారు స్కిడ్‌ అయి లోయలోకి పడినట్టు చెబుతున్నారు. మృతులంతా కేరళకు చెందిన వారిగా తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన కారు డ్రైవర్‌ను అజాద్‌ అహ్మద్‌ అవాన్‌గా గుర్తించారు. అతని పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో స్కిమ్స్‌కు తరలిస్తున్నారు. గత నెలలో కూడా జమ్మూకశ్మీర్‌లోని దోడా సవిూపంలో ఒక బస్సు లోయలో పడి 36 మంది దుర్మరణం పాలయ్యారు.

 

జొన్న రొట్టెల కోసం వ‌చ్చి… ప్రియురాలి భ‌ర్త‌ హ‌త్య

తెలంగాణ ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి.. తొలి ఆదేశం ఇదే…

పాగాల సంపత్‌కు కెటిఆర్‌ నివాళి : అండ‌గా ఉంటామ‌ని హామీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *