53కు చేరిన మృతులు
అమెరికాలోని హవాయి ద్వీపం తగలబడుతోంది. అగ్నికీలలకు బలమైన గాలులు తోడయ్యింది. దీంతో మావీరు ద్వీపం అల్లకల్లోలంగా మారింది. వెయ్యికిపైగా ఇళ్లు మండల్లో కాలిబూడిదయ్యాయి. 53 మంది ఈ మంటల్లో మరణించారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. హవాయి దగ్గరలో 82 మైళ్ల వేగంతో, మావీరులో గంటకు 62 మైళ్ల వేగంతో గాలులు వీస్తున్నాయని అక్కడి అధికారులు తెలిపారు. మంటల ధాటికి అనేక భవనాలు దెబ్బతిన్నాయని, చెట్లు, కార్లు, ఇతర వాహనాలు మంటల్లో మాడిపోయాయి. వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.
Check Also
OnePlus” వన్ ప్లస్ 13 స్మార్ట్ ఏఐ ఫోన్ 16GB RAM, 512GB స్టోరేజ్
OnePlus ” వనప్లస్ నుంచి భారీ ఫోన్ రిలీజ్ అయ్యింది. వివరాలు చూసుకున్నట్టయితే.. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ మొబైల్ …