సీక్రెట్‌ ఏజెంట్‌గా కళ్యాణ్‌ రామ్‌

బింబిసార బ్లాక్‌ బస్టర్‌ విజయం అనంతరం ఆ స్థాయి విజయం కోసం ఎదురుచూస్తున్న కల్యాణ్‌ రామ్‌ నుంచి వస్తున్న తాజా చిత్రం డెవిల్‌ – ది బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ పీరియాడిక్‌, స్పై థ్రిల్లర్‌ జానర్‌ లో వస్తున్న సినిమా ట్రైలర్‌ విడుదల చేయగా ఇందులో ఏదో సమ్‌థింగ్‌ ఉంది అనేలా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నది. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా దర్శకత్వం వహిస్తూ నిర్మించిన ఈ చిత్రంలో విరూపాక్ష, సర్‌ వంటి వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న సంయుక్తా విూనన్‌ కథానాయికగా నటిస్తుండగా, మాళవికా నాయర్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నది. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 29న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. ట్రైలర్‌ ప్రకారం బ్రిటీష్‌ పాలనలో ఓ నగరంలో జరిగే హత్యలు, ఎవరికీ అంతు చిక్కని ఓ రహస్యాన్ని ఓ బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌గా నందమూరి కళ్యాణ్‌ రామ్ ఎలా చేధించాడనే ఇతివృత్తంలో సినిమా ఆద్యంతం సస్పెన్స్‌తో, థ్రిల్లింగ్‌,యాక్షన్‌ సన్నివేశాలతో ఉండనున్నట్లు తెలుస్తోంది.

సలార్‌, డంకీల మధ్య పోటీ

రేవంత్‌ను వ‌దిలిపెట్ట‌బోం.. హామీలు ఎలా అమలు చేస్తారో మేమూ చూస్తాం కేటీఆర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *