తెలంగాణలో కొత్త సర్కారు కొలువుదీరిన తరువాత దూకుడు వ్యవహరిస్తోంది. ప్రజా పాలన అంటూ ముందుకెళ్తుంది. అందులో భాగంగానే కొత్తరేషన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించింది. అయితే ఇందుకోసం డిసెంబర్ 28 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్టు సమాచారం. చాలా కాలంగా కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరించలేదు.. ఈ క్రమంలో కొత్త సర్కారు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు తెలియడంతో లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు 6, 47,297 కార్డులు జారీ అయినట్టు సమాచారం.కొత్తగా పెండ్లయిన వారికి, పిల్లల పేర్లు నమోదు కాని వారు ఇప్పుడు నమోదు చేసుకోవచ్చు.
మీ సెంటర్ల ద్వారా…
ఈ దరఖాస్తులను మీ సేవా సెంటర్ల ద్వారా స్వీకరించాలని గవర్నమెంట్ భావిస్తున్నట్టు సమాచారం. అర్హులను ఎంపిక చేసేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టనున్నారు. గ్రామాల్లో గ్రామ సభ, పట్టణాల్లో పట్టణ సభలు నిర్వహించి లబ్ది దారులను ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది.
పల్లవి ప్రశాంత్ తప్పు చేశాడా..?
శ్వేత పత్రానికి కౌంటర్ స్వేద పత్రం.. దెబ్బతీస్తే సహించం కేటీఆర్