రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్ సీజన్ 7లో పాల్గొనాలని ఎంతో కోరుకున్నాడు. అదే తడవుగా 13వ కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్‌లో అడుగుపెట్టి అందరి అభిమానాన్ని పొందాడు. హౌజ్‌లో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా ఎదుర్కొని నిలబడ్డాడు. చివరికి విజేతగా నిలిచాడు. ఈ తరుణంలో అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటికి వచ్చే సమయంలో కొన్ని అనుకోని పరిణామాలు చోటుచేసుకున్నాయి. కొందరు వ్యక్తులు ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్తుల్ని ధ్వంసం, దాడులు చేయడంతో చిక్కులు ఎదురయ్యాయి.అన్నపూర్ణ స్టూడియో వద్ద కొన్ని వాహనాల ధ్వంసమయ్యాయి. దీనికి ప్రధాన కారకులుగా, పల్లవి ప్రశాంత్, అతడి తమ్ముడు మహవీర్, వారి స్నేహితులుగా గుర్తించారు. అయితే పల్లవి ప్రశాంత్, మిగతా వారికి కోర్టు రిమాండ్ విధించింది. లాయర్లు, కొందరు సెలబ్రిటీలు అతడికి సపోర్టుగా నిలిచారు. అభిమానులు చేసిన తప్పులకు అతడిని శిక్షించొద్దని పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై వాదనలు విన్న నాంపల్లి కోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్‌ను ప్రశాంత్‌కు మంజూరు చేసింది. ఆదివారం పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీచేసింది.
కరీంనగర్ నుంచి తిరుపతికి నాలుగు సార్లు
పల్లవి ప్రశాంత్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొలుగూరు గ్రామానికి చెందినవాడు. వీరిది వ్యవసాయ కుటుంబం కావడంతో చిన్నప్పటి నుంచి వ్యవసాయంపై మక్కువ ఏర్పడింది. సోషల్ మీడియాలో రైతుబిడ్డగా చెప్పుకుంటూ వీడియోలు చేసుకుంటూ వచ్చాడు. యూట్యూబ్, ట్విట్టర్‌లో రైతుల కష్టాలు, వ్యవసాయంలో వచ్చే నష్టాల గురించి వీడియోలు తీస్తుండేవాడు. ఆయన వీడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చేది. ఈ సమయంలోనే తనకు బిగ్‌బాస్‌లో పాల్గొనాలని, తనకు మద్దతు తెలపాలని సోషల్ మీడియా వేదికగా కోరాడు. నాగార్జున గారికి తెలిసేలా పోస్టులు చేయాలని అడిగాడు. ఇది చాలా వైరల్ మారి బిగ్‌బాస్ నిర్వాహకుల దాకా వెళ్లింది. అదే తడవుగా అతడికి పిలుపు వచ్చి 13వ కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి అడుగుపెట్టాడు. ఇందులో బిగ్‌బాస్ ఇస్తున్న టాస్క్‌లను విజయవంతంగా పూర్తిచేసుకుంటూ వచ్చాడు. ఇందులో వారి ఆటతీరు, తోటి వారితో ప్రవర్తించే విధానాన్ని ప్రేక్షకులు గమనిస్తూ వచ్చారు. ఫైనల్‌గా అమర్‌దీప్, పల్లవి ప్రశాంత్ మధ్య నెలకొన్న పోటీలో ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అయితే అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి రైతుబిడ్డను చూడాలని అభిమానులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. హౌజ్‌లో పల్లవి ప్రశాంత్‌కు నెగెటివ్ ఉన్న కంటెస్టెంట్లను చూసి అభిమానులను చూసి రెచ్చిపోయారు. వారి కార్ల అద్దాలను పగులగొట్టారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్పుడే బయటికి వస్తున్న ప్రశాంత్‌ను పోలీసులు వేరే మార్గం కృష్ణానగర్ వరకు తీసుకెళ్లారు. కానీ కొద్దిసేపటి తర్వాత మళ్లీ అన్నపూర్ణ స్టూడియో ముందు అభిమానులకు అభివాదం చేస్తూ కనిపించాడు. డీసీపీ స్థాయి అధికారి వచ్చి వెళ్లిపోవాలని చెప్పినా వినకుండా అక్కడే ఉన్నాడు. అభిమానులు ఆగ్రహం తట్టుకోలేక పోలీసు వాహనాలను, ఆర్టీసీ బస్సుల అద్దాలను పగులగొట్టారు. దీంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ జూబ్లీహీల్స్ పోలీస్టేషన్‌లో డిసెంబర్ 18న కంప్లెంట్ చేశారు. దీంతో పాటు పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.
బిగ్‌బాస్ ప్రారంభం..
బిగ్‌బాస్ ముందుగా హిందీలో 2007లో ప్రారంభమైంది. అప్పటికీ దేశంలో ఇటువంటి షోలను చూడని అభిమానులకు బాగా నచ్చింది. నిర్వాహకులకు కూడా మంచి లాభాన్ని తీసుకొచ్చి పెట్టింది. ఇప్పుడు ఏడు భాషల్లో హిందీ, కన్నడ, బెంగాలీ, తమిళ్, మలయాళం, కన్నగ, తెలుగులో బిగ్‌బాస్‌ను నిర్వహిస్తున్నారు. తెలుగులో మొదటగా 2017లో ప్రారంభమై ఇప్పటి వరకు విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పుడు ఇలా జరగడం నిర్వాహకుల్లో కొంత నిరుత్సాహాన్ని కలిగిస్తోంది.
శ్వేత పత్రానికి కౌంటర్ స్వేద పత్రం.. దెబ్బతీస్తే సహించం కేటీఆర్
కదులుతున్న రైలు ఎక్కొద్దు అంటే వినరు.. చూడండి ఏం జరిగిందో..