విహార యాత్ర వారి పాలిట విషాదాన్ని మిగిల్చింది. వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి చెట్టుకు ఢీ కొని బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన మహబూబాబాద్ పట్టణ శివారు ఏటిగడ్డతండా సవిూపంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ నుంచి కారులో మారేడుమిల్లికి విహార యాత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు వెంగళదాసు సాయిరాం, రవితేజగా గుర్తించారు. సంగినేని సాయిరాం, లకëణ్, సాయితేజకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను మహబూబాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
17న మా అబ్బాయి పెళ్లి.. తొలిపత్రికను ఆయనకిచ్చి ఆహ్వానం వైఎస్ షర్మిల ట్విట్
తూర్పుగోదావరి జిల్లాలోని దేవరపల్లి మండలం దుద్దుకూరు జాతీయ రహదారిపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 19 నెలల చిన్నారి సహా ముగ్గురు మృత్యువాతపడ్డారు. విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తున్న ఎర్టిగా కారు టైర్ పంచర్ కావడంతో రాంగ్ రూట్‌లో దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న మరో ఎర్టీగా కారును ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ఘటనాస్థలిలోనే మృతి చెందారు… మరో ఏడు మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని దేవరపల్లి ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 19 నెలల గనిస్కా మృతి చెందింది. మిగిలిన వారికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.