17న మా అబ్బాయి పెళ్లి.. తొలిపత్రిక‌ను ఆయ‌న‌కిచ్చి ఆహ్వానం వైఎస్ ష‌ర్మిల ట్విట్

ఫిబ్రవరి 17న తన కుమారుడు వైఎస్‌ రాజారెడ్డి వివాహం జరగనున్నట్టు వైఎస్‌ షర్మిల తెలిపారు. ఈ మేరకు ఆమె ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. అట్లూరి ప్రియతో రాజారెడ్డికి వివాహం జరగనున్నట్లు తెలిపారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా కుమారుడు రాజారెడ్డికి అట్లూరి ప్రియతో జనవరి 18న నిశ్చితార్థ వేడుక నిర్వహించనున్నాం. ఫిబ్రవరి 17న వివాహం జరగనున్న సంగతి విూతో పంచుకోవడం ఆనందంగా ఉంది. మంగళవారం మేము కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ ఘాట్‌ని సందర్శిస్తాం. తొలి ఆహ్వాన పత్రికను అక్కడ ఉంచి నాన్న ఆశీస్సులు తీసుకుంటాం అని షర్మిల పేర్కొన్నారు.

 

ఆర్టీసీలో ఆ టికెట్లు ర‌ద్దు.. మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న‌

ఒకే కొత్త సంవ‌త్స‌రం అక్క‌డ 16 సార్లు జ‌రుపుకుంట‌రు..

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *