ఒకే కొత్త సంవ‌త్స‌రం అక్క‌డ 16 సార్లు జ‌రుపుకుంట‌రు..

నూత‌న సంవ‌త్స‌రమంటే డిసెంబ‌ర్ 31 అర్థ‌రాత్రి 12 గంట‌లు దాటుతున్న స‌మ‌యంలో జ‌రుపుకుంట‌రు. ఆ స‌మ‌యంలో ప్ర‌పంచ‌మంతా ఆనందోత్సాహాలు, బాణసంచా వెలుగుల మధ్య ప్రజలు కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తారు. కానీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములు 2024కు వినూత్నంగా ఆహ్వానం పలికారు. వారు ఒకే న్యూఇయర్‌ను 16 సార్లు సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఐఎస్‌ఎస్‌.. భూమి చుట్టూ రోజుకు 16సార్లు భ్రమిస్తుంది. ప్రతి 92.9 నిమిషాలకు ఒకసారి భూమిని చుట్టివస్తుంది. ప్రతిసారి భూమిపై ఉన్న 90 శాతం జనాభాను కవర్‌ చేస్తుంది.

పామును రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం.. వీడియో వైర‌ల్

ఐఎస్‌ఎస్‌లో ఉన్న వ్యోమగాములకు 12 గంటల పగలు, 12 గంటల రాత్రి ఉంటుంది. భ్రమణంలో భాగంగా వారు 45 నిమిషాల పగలు, 45 నిమిషాల రాత్రిని చూస్తారు. దాంతో వారు ఒకరోజులోనే 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలు వీక్షిస్తారు. అలా 16 భ్రమణాల్లో పదేపదే న్యూ ఇయర్‌ను వీక్షించారు. ఈ అంతరిక్ష కేంద్రాన్ని 15 దేశాలు కలిసి నిర్వహిస్తున్నాయి. 2000 సంవత్సరం నుంచి అక్కడకు వ్యోమగాములు వెళ్తూనే ఉన్నారు. ఆరు పడగ గదుల ఇల్లు పరిమాణం కంటే పెద్దగా ఉండే ఈ స్టేషన్‌లో సాధారణంగా ఏడుగురు వ్యోమగాములు పనిచేస్తుంటారు. దాదాపు రెండు సంవత్సరాల(665 రోజులు) పాటు స్పేస్‌ స్టేషన్‌లో విధులు నిర్వర్తించిన వ్యక్తిగా 2017లో అమెరికా వ్యోమగామి పెగ్గీ విట్సన్‌ రికార్డు సృష్టించారు.

పామును రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం.. వీడియో వైర‌ల్

600 కిలోల అయోధ్య రామాలయ గంట

టార్గెట్ లోక్ స‌భ‌… బండికి ప‌గ్గాలు అప్ప‌జెప్పుతారా..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *