Anand Mahindra” ఆనంద్ మ‌హింద్రాను ఆక‌ర్షించిన పానీపూరీ బండి: వీడియో వైర‌ల్‌

Anand Mahindra"

Anand Mahindra”  ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహింద్ర సోష‌ల్ మీడియాలో ఆక్టివ్‌గా ఉంటారు. ఆక్టివ్ గా ఉండ‌డంతో పాటు కొంత‌మంది పేద‌వారికీ స‌హాయ‌ప‌డుతుంటారు. ఇప్పుడు మ‌రోసారి ఆయ‌న చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. పానీ పూరీ బండి ఆయ‌న‌ను ఆక‌ర్షించింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కు చెందిన ఓ మ‌హిళా పానీపూరి బిజినెస్ ప్రారంభించాల‌నుకుంది. అనుకుందే త‌డ‌వుగా ఓ వ్యాన్‌ను కొనుగోలు చేసి దాన్ని కొంచెం మాడిఫై చేసి పానీ పూరీల వ్యాపారాన్ని ప్రారంభించింది. వ్యాపారం బాగా డెవ‌ల‌ప్ కావ‌డంతో ఆమె త‌న బండిని లాగేందుకు మ‌హింద్రా థార్‌ను కొనుగోలు చేసింది. పానీపూరి బండిని థార్ వాహ‌నానికి త‌గిలించుకుని వెళ్ల‌డాన్ని ఆమె వీడియో తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో ల‌క్ష‌ల వ్యూస్ సంపాందిచండంతో పాటు వాహ‌నాలు త‌యారు చేసే మ‌హింద్ర కంపెనీ ఓన‌ర్ ఆనంద్ మహింద్ర‌కు చేరింది. ఆ వీడియోను చూసిన ఆయ‌న ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. ఆ వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు. ప్రజలు ఎదగడానికి, వారి కలలను సాకారం చేసుకోవడానికి తమ కార్లు ఉపయోగపడాలని కోరుకుంటున్నట్లు రాశారు. అసాధ్యమైన వాటిని అన్వేషించడంలో ప్రజలకు సహాయపడండి పోస్ట్ చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *