Wednesday , 15 January 2025
Breaking News
T.M.K.J.F

ఐక్య ఉద్యమాల తోనే కాపుల రాజ్యాధికారం

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చింతకుంట విఠల్
మనంగా టీఎంకేజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గ ఆత్మీయ సత్కారం
-టీఎంకేజేఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ 

mnక‌రీంన‌గ‌ర్ టౌన్ :  ఐక్య ఉద్యమాలతోనే కాపులు రాజ్యాధికారాన్ని సాధించుకోవచ్చని దీనికోసం మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చింతకుంట విఠల్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శుభమంగల్ కన్వెన్షన్ హాల్ లో ఆదివారం తెలంగాణ మున్నూరుకావు జర్నలిస్ట్ ఫోరం రాష్ట్రకార్యవర్గ ఆత్మీయ సత్కార కార్యక్రమానికి ఫోరం జిల్లా అధ్యక్షులు వేల్పుల శ్రీనివాస్ ప‌టేల్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చింతకుంట విఠల్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో మున్నూరుకాపులు పాత్ర కీలకమైందన్నారు. నీరు, నిధులు, నియమాకాలు వస్తాయన్న ఆశతో ఉద్యమాన్ని ప్రాణాలు పణంగా పెట్టి పోరాడితే సాధించుకున్న రాష్ట్రాన్ని అదోగతి చేసిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. కాపులు మౌనంగా ఉన్నంత వరకు ఎలాంటి రాజ్యాధికారిన్ని సాధించుకునే పరిస్థితి ఉండ‌ద‌న్నారు. పాలక వర్గాలు కాపుల దగ్గరకు వచ్చి ప్రాధేయప‌డాల్సిన పరిస్థితి కల్పించాల‌ని సూచించారు. ఎక్కువ జనాభా ఉన్న బీసీలు ఎన్నో సార్లు అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉన్నా అగ్రవర్ణలా పెద్దరికం వల్ల చేజారిపోయిందని వాపోయారు. ముఖ్యమంత్రి స్థాయి ప‌దువులను కూడా వదులుకున్న సందర్భలు ఉన్నాయన్నాయ‌ని గుర్తు చేశారు. మున్నూరుకావులు ఇదే తరహాలో ఐక్యంగా ఉంటే రానున్న మూడేళ్లలో బ‌లమైన శక్తిగా మారే అవకాశం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు వాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చినప్పుడే కాపులు బ‌లప‌డుతారని, కాపులను మరో ఉద్యమానికి ఉసి గొల్పేందుకు సిద్ధం కావాలన్నారు. ఐక్యంగా ఉన్న‌ప్పడే మన ఐలం’ బలగం పెరుగుతుందని మనలో మనల్ని విచ్చినం చేసే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాల‌ని సూచించారు. రాబోయే రోజుల్లో కాపులు రాజకీయంగా ఆర్ధికంగా, సామాజికంగా ఎదిగి రాజ్యాధికార దిశ గా పయనించేందుకు సిద్ధం కావాలన్నారు. మున్నూరు కాపు సంఘం రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు బండి వద్మ మాట్లాడుతూ.. ప్రతి ఎన్నికల్లో కాపులను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారే తప్ప వారి భవిష్యత్ పట్ల ఏ నాయకులు శ్రద్ద చూపడం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కాపులను నిందించినప్పుడు ఎదిరించే సత్తాను పెంచుకోకపోతే భవిష్యత్ లో అనేక ఇబ్బందులు ఎదుర్కొక తప్పదన్నారు. మహిళలతో పాటు మున్నూరుకాపుల్లో అన్ని విభాగాలతో కలిసి జేఏసీ గా ఏర్పడి ఉద్యమానికి రూపకల్పన చేయలన్నారు. కాపుల ఐక్యత కోసం ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా కృషి చేసినప్పుడే ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణ మున్నూరు కాపుజర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఏ మాత్రం శ్రమించని వ్యక్తులే అధికారం సాధించి తమ ప‌బ్బం గడువుకుంటున్నారని ఆరోపించారు. జనాభాలో సింగిల్ డిజిట్ దాటని వర్గాలే మొదటి నుంచి బీసీలను అణ‌గదొక్కుతు రాష్ట్రాన్ని పాలిస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గంలో చోటు లభించిన మున్నూరు కావు సంఘ నాయకులను మనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఫోరం క్యాలెండర్ ను ఆవిష్కరించడంతో పాటు పటేల్ యూత్ ఫోర్స్ లోగోను విడుదల చేశారు. అనంతరం ముఖ్య అతిధులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు సాయినరేందర్, రాజ్ కుమార్, మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎర్రం రాజిరెడ్డి కవి వసుల రవి కుమార్, మాజీ తహసిల్దార్ కొట్టె వెంకటనారాయణ, ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు మామిండ్ల రమేశ్ ప‌టేల్, ప్రముఖ ఇంజనీర్ కోలా అన్నారెడ్డి, ఆకుల ప్రభాకర్, ఉప్పు తిరుపతి, పత్యం వసంత, సుదీర్, ఉద్యోగల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్ , రంగారెడ్డి జిల్లా కన్వీనర్ గంట విజయ్ కుమార్, సీనియర్ రిపోర్టర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర కార్యవర్గానికి ఘన సన్మానం..

ఇటీవల హైదరాబాద్లో రాష్ట్ర సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మున్నూరుకావు జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర కార్యవర్గాంలో అవకాశం పొందిన కరీంనగర్ జిల్లా నుండి ఉపాధ్యాక్షులు గా కామినేని మధుసుదన్, రాష్ట్ర కార్యదర్శలుగా ఏబూసి శ్రీనివాస్, దూలూరి జగన్మోహస్. అర్గనైజింగ్ సెక్రటరీగా అట్టపల్లి శ్రీనివాస్, మహిళ రాష్ట్ర కార్యదర్శిగా జే. సుమ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పోకల మధు, బొమ్మడి విజయకుమార్, సిరిసిల్లా జిల్లా నుండి రాష్ట్ర కార్యదర్శిగా నూగురి మహేశ్, కార్యదర్శి గదిల ప్రవీణ్, ఎడ్ల చంద్రశేఖర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మోహస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొప్పల ప్రసాద్ జగిత్యాల జిల్లా నుంచి రాష్ట్ర . కార్యదర్శిగా పాముల సత్యనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎర్రం చందనకుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ముస్కు లక్ష్మి నారాయణ, గండ్ల వేణుగోపాల్, కు నియమకపత్రాలు అందజేయడంతో పాటు శాలువతో ఘనంగా సత్కరించారు.

About Dc Telugu

Check Also

Game Changer Movie

Game Changer Movie” గేమ్ చేంజ‌ర్ .. అర్థం చేసుకుంటే స‌మాజ చేంజ‌ర్‌..ఇది రివ్యూకాదు.. బాగుంద‌ని చెప్పే మాట‌

Game Changer Movie”  ఎన్నో సినిమాలు చూస్తాం.. చూసి (enjoy) ఎంజాయ్ చేస్తాం. కానీ కొన్నిసినిమాలు మాత్రం మ‌న‌సుకు హ‌త్త‌కుంటాయి. …

14.01.2025 D.C Telugu Cinema

12.01.2024 D.C Telugu Cinema

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com