Lpg Cylinder Prices” వంట గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర త‌గ్గింపు.. విప‌క్షాలు ఏమ‌న్నాయంటే…?

Lpg Cylinder Prices

Lpg Cylinder Prices” అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంద‌ర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలోని మహిళలకు కానుక ప్రకటించారు. లోక్‌సభ ఎలక్షన్‌ల‌కు ముందు వుమెన్స్ డే కానుకగా ఎల్పిజి (Lpg Cylinder Prices)  సిలిండర్ల ధరలను తగ్గిస్తున్నట్లు పీఎం నరేంద్ర మోదీ ప్రకటించారు. ఎల్పీజీ (Lpg Cylinder Prices) సిలిండర్ల ధరల్లో 100 రూపాయ‌లు తగ్గింపు ఇస్తున్న‌ట్టు బీజేపీ నేతృత్వంలోని స‌ర్కారు నిర్ణయించినట్లు పీఎం మోదీ శుక్రవారం పేర్కొన్నారు. సోషల్‌ విూడియా ఫ్లాట్ ఫారం ఎక్స్‌ లో పీఎం మోదీ ఈ సమాచారాన్ని తెలిపారు. ఇంట‌ర్నేష‌న‌ల్ మ‌హిళా దినోత్సవం సందర్భంగా (Lpg Cylinder Prices) ఎల్‌పీజీ సిలిండర్ల ధరను రూ. 100 తగ్గిస్తున్న‌ట్టు పీఎం నరేంద్ర మోదీ చేసిన ప్రకటనపై ప్ర‌తి పక్షాలు స్పందించాయి.

 

లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు ముందు గవ‌ర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ ఎత్తుగడేనని విమ‌ర్శించారు. ఇది మోదీ సర్కార్‌ మోసపూరిత చర్య అని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే గుప్పించారు. 9 సంవ‌త్స‌రాలుగా అధికారంలో ఉన్న కాషాయ పాలకులకు గతంలో ఇలా ఎందుకు ఆలోచించలేదని ఆమె సూటిగా ప్రశ్నించారు. ఎల‌క్ష‌న్లు ముంచుకొచ్చినప్పుడే వారికి గ్యాస్‌ ధరల భారం యాదికి వచ్చిందా అంటూ నిలదీశారు. తమ స‌ర్కారు హ‌యాంలో గ్యాస్‌ సిలిండర్‌ కేవలం 430 రూపాయ‌ల‌కే లభించేదని చెప్పుకొచ్చారు. ఏడు నెలలుగా గ్యాస్‌ ధరలను ఎందుకు తగ్గించలేదని, ఎన్నికలకు ముందు ఇప్పుడే ఇలా ఎందుకు చేశారని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సాకేత్‌ గోఖలే కేంద్ర ప్ర‌భుత్వాన్ని నిలదీశారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ తెలివైన పార్టీ అని వారు రూ. 395 విలువైన సిలిండర్లను రూ. 1000కి విక్రయిస్తూ ఇప్పుడు పీఎం మోదీ దాన్ని రూ. 100 తగ్గించినట్టు ఆర్భాటంగా ప్రకటించారని కాంగ్రెస్‌ ప్రతినిధి సురేంద్ర రాజ్‌పుట్ విమ‌ర్శించారు. తృణమూల్‌ నేత సాఘరికా ఘోష్‌ సైతం గ్యాస్‌ ధరల తగ్గింపు ప్రకటించిన సమయాన్ని తప్పుపట్టారు. గత కొన్ని నెలలుగా మహిళలు వంట గ్యాస్‌ భారాన్ని మోయలేకున్నారని, గ్లోబల్‌ మార్కెట్‌లో ధర తగ్గినా దేశీ మార్కెట్‌లో తగ్గించలేదని, ఇప్పుడు ఎన్నికల ముందు రూ. 100 తగ్గించారని ఆమె పేర్కొన్నారు. భారత్‌కు ప్రధాన మంత్రి అవసరమని, ఎన్నికల మంత్రి అవసరం లేదని ఆమె దుయ్యబట్టారు.

ఇవి కూడా చ‌ద‌వండి

Scorpio Viral Video” వామ్మో స్కార్పియోలో ఇంత మందా…? నోరెళ్ల‌బెట్టిన నెటిజ‌న్లు..

Karimnagar news” పత్తెం వసంతకు మహిళా దినోత్సవ అవార్డు

Polar Bear” త‌ల్లి ప్రేమ అంటే ఇదే.. ఎలుగుబంటి వీడియో వైర‌ల్

రోడ్డు ప్ర‌మాదంలో ముగ్గురు చిన్నారులతో పాటు ఐదుగురు మృతి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *