Ktr Speech” మనోళ్లకు పోటీ మనోళ్లే అని మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే( Ktr Speech) కేటీఆర్ అన్నారు. బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ ల లిస్ట్ చూడండన్నారు. చేవెళ్లలో నిలబడ్డోల్లు ఇద్దరు మనోళ్లే రంజిత్ రెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డి బీఆర్ ఎస్‌లకెళ్లి పోయినోళ్లే అని చెప్పారు. మల్కాజ్‌గిరి చూడండి ఈటల రాజేందర్, పట్నం సునీత ఇద్దరు ఇండ్లకెళ్లి పోయినోళ్లే అన్నారు. సికింద్రబాద్ చూడండి దానం నాగేందర్ ఇండ్లకెళ్లి పోయినోడే, భువనగిరి చూస్తే బూర నర్సయ్య, సూడుర్రి మొత్తం రాష్ట్రంలో ఎక్కడ చూసిన మనోళ్లే ఉన్నారన్నారు. వరంగల్ చూస్తే ఆరూరి రమేశ్, కడియం కావ్య, ఆదిలాబాద్ పోతే నగేశ్ మొత్తం రాష్ట్రంలో ఇయ్యాల పోటీ మనోళ్లకు మనోళ్లకే ఉన్నట్టు ఉన్నది తప్ప వాళ్లకు అభ్యర్థులు లేరు, క్యాడర్ కూడా దిక్కులేదన్నారు. ఒకాయన అంటాడు మోడీ హవా బాగుందంటాడు. మోడీ హవా అంత బాగుంటే వేరే పార్టీలోకెళ్లి అభ్యర్థులను ఎందుకు తీసుకుపోతున్నవ్ మరి అని ప్రశ్నించాడు. మీదాంట్లో చిన్న కార్యకర్తను పెట్టి గెలిపించుకునే దమ్ములేదా అని ప్రశ్నించారు. బీజేపీకి అంతగానం ధైర్యం ఉంటే వేరే పార్టీ నుంచి దేవులాడి దేవులాడి ఎత్తుకుపోతున్నారని అడిగారు. అంతగానం హవా ఉంటే ఎవలను పెట్టిన గెల్వాలే కదా అన్నారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు అభ్యర్థులే దిక్కులేరు..
రాష్ట్రంలో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ నుండి పోయినోళ్లే అభ్యర్థులు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS pic.twitter.com/bbB46FhdCb
— BRS Party (@BRSparty) April 3, 2024
ఇవి కూడా చదవండి
Lions Fight” కొట్లాడుకున్న సింహాలు.. తప్పించుకున్న నీటి బర్రె.. వీడియో వైరల్
Husband, Wife Fight” చికెన్‌లో మసాలా తక్కువైందని బిల్డింగ్‌పై నుంచి తోసేశాడు, వీడియో రికార్డు..
Husband, Wife Fight” చికెన్‌లో మసాలా తక్కువైందని బిల్డింగ్‌పై నుంచి తోసేశాడు, వీడియో రికార్డు..