Mumbai News” మహారాష్ట్ర రాజధాని ముంబాయిని గాలిదుమారం అతాలకుతలం చేసింది. ఈదురుగాలులతో పాటు గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. సిటీ అంతా ఆగమాగం అవుతున్నది. సోమవారం సాయత్రం Mumbai News” బొంబాయి ఘాట్‌కోపర్ ప్రాంతంలోని ఫ్యూయోల్ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద నున్న భారీ హోర్డింగ్ ఒక్కసారిగా కూలింది. ఈ ఘటనలో 70 మంది గాయపడ్డారు. 9 మంది మృతి చెందినట్టు సమాచారం. హెర్డింగ్ కింద చిక్కుకుపోయిన వారిని ఎన్‌డీఆర్ ఎఫ్ బృందాలు రక్షించాయి. హోర్డింగ్ కింద చిక్కుకుపోయిన వారిని రక్షించాలని ఆదేశాలు జారీ చేసినట్టు ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎక్స్ ద్వారా పేర్కొన్నారు. గాయపడ్డ వారిని పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆకస్మికంగా గాలిదుమారం లేచింది. ఘట్‌కోప్, బాంద్రా, కుర్ల, ధారవి వంటి ప్రాంతాల్లో బలమైన గాలులు వీచాయి. ఉరుములు మెరుపులతో వాన పడింది. ఈ వానకు సీటిలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎయిర్‌పోర్ట్‌లో తాత్కాలికంగా టేకాఫ్‌లునిలిపివేశారు. గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది.
ఈ వీడియోను ఎఎన్ఐ వారు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
#WATCH | Maharashtra | 35 people reported injured after a hoarding fell at the Police Ground Petrol Pump, Eastern Express Highway, Pantnagar, Ghatkopar East. Search and rescue is in process: BMC
(Viral video confirmed by official) https://t.co/kRYGqM61UW pic.twitter.com/OgItizDMMN
— ANI (@ANI) May 13, 2024
ఈ వీడియోను తెలుగు స్రయిబ్ వారు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ముంబైలో ధూళి తుఫాను బీభత్సం
ధూళి తుఫాను ధాటికి రోడ్డుపై కూలిపోయిన పరంజా pic.twitter.com/kap6yqXGhx
— Telugu Scribe (@TeluguScribe) May 13, 2024