Wednesday , 24 July 2024
Mumbai News"

Mumbai News” బొంబాయిలో గాలిదుమారం బీభ‌త్సం.. కూలిన హోర్డింగ్‌.. వీడియోలు వైర‌ల్

Mumbai News” మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబాయిని గాలిదుమారం అతాల‌కుత‌లం చేసింది. ఈదురుగాలుల‌తో పాటు గాలివాన బీభ‌త్సం సృష్టిస్తోంది. సిటీ అంతా ఆగ‌మాగం అవుతున్న‌ది. సోమ‌వారం సాయ‌త్రం Mumbai News”  బొంబాయి ఘాట్‌కోప‌ర్ ప్రాంతంలోని ఫ్యూయోల్ ఫిల్లింగ్ స్టేష‌న్ వ‌ద్ద నున్న భారీ హోర్డింగ్ ఒక్క‌సారిగా కూలింది. ఈ ఘ‌ట‌న‌లో 70 మంది గాయ‌ప‌డ్డారు. 9 మంది మృతి చెందిన‌ట్టు స‌మాచారం. హెర్డింగ్ కింద చిక్కుకుపోయిన వారిని ఎన్‌డీఆర్ ఎఫ్ బృందాలు ర‌క్షించాయి. హోర్డింగ్ కింద చిక్కుకుపోయిన వారిని ర‌క్షించాల‌ని ఆదేశాలు జారీ చేసిన‌ట్టు ఉప ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ ఎక్స్ ద్వారా పేర్కొన్నారు. గాయ‌ప‌డ్డ వారిని పోలీసులు స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. సోమ‌వారం మధ్యాహ్నం మూడు గంట‌ల‌కు ఆక‌స్మికంగా గాలిదుమారం లేచింది. ఘ‌ట్‌కోప్‌, బాంద్రా, కుర్ల‌, ధార‌వి వంటి ప్రాంతాల్లో బ‌ల‌మైన గాలులు వీచాయి. ఉరుములు మెరుపుల‌తో వాన ప‌డింది. ఈ వాన‌కు సీటిలో ఎక్క‌డిక‌క్క‌డ ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎయిర్‌పోర్ట్‌లో తాత్కాలికంగా టేకాఫ్‌లునిలిపివేశారు. గంట‌కు 50-60 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీస్తాయ‌ని అక్క‌డి వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది.

 

ఈ వీడియోను ఎఎన్ఐ వారు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

 

ఈ వీడియోను తెలుగు స్ర‌యిబ్ వారు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

 

 

About Dc Telugu

Check Also

Crime News

Crime News” ఆరుగురు సొంత కుటుంబ స‌భ్యుల‌నే చంపిన మాజీ సోల్జ‌ర్

Crime News” మాజీ సోల్జ‌ర్ త‌న సొంత కుటుంబ స‌భ్యులనే దారుణంగా హ‌త‌మార్చిన ఘ‌ట‌న హ‌ర్యాల‌నాలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి …

Delhi - Meerut Expressway

Delhi – Meerut Expressway” బైక్ ను రాంగ్ రూట్లో వచ్చి గుద్దిన కారు.. ప్రమాదంలో తల్లి, కుమారుడు మృతి..

Delhi – Meerut Expressway”  ఢిల్లీ మీర‌ట్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. రాంగ్ రూట్లో వ‌చ్చిన …

Hyderabad News

Hyderabad News” ఓల్డ్ సిటీలో విరిగిప‌డ్డ చెట్టు.. 12 మందికి తీవ్ర గాయాలు

Hyderabad News” రెండు మూడు రోజులుగా వ‌ర్షాలు ఎడ‌తెరిపిలేకుండా కురుస్తున్నాయి. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో చాలా ప్రాంతాలు జ‌ల‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com