coalition government.”
- శనార్తే మల్లన్న…
ఆ శనార్తే రామన్న
ఏటో పోతన్నవేమే మల్లన్న
ఆయుటిపూనింది… మృగశిర కార్తెవొచ్చింద కదా.. అట్ల పొలందాకాపోయి పత్తిపొరక ఏరాలే.. అరినారు కూడా పోయ్యాలే.. పొలందాకా పోతున్నా..
గిడ బడికాడ కూసున్నవేమో రామన్న..
పేపర్ చదువుదామని అచ్చిన్నే.. మొన్న ఎలక్షన్ల ముచ్చట తెలిసిందే కాదే పేపర్లో చూత్తన్ననే మల్లన్న ..
అవుకాని రామన్న (Narendra Modi) మోడీకి తక్కువ సీట్లచ్చినయి అంటర్రు.. మళ్లా మోడీ ప్రధానమంత్రి అంటర్రు.. సంకీర్ణ కూటమి… ఎన్డీఏ ప్రభుత్వం అని పొద్దుగూకి వార్తలల్ల ఇన్న ఎటు అర్తమయితలేదు.. కొంచెం చెప్పరాదే..
ఏంలేదే మల్లన్న మన దేశంలా 28 రాష్ట్రాలు.. 7 కేంద్రపాలిత ప్రాంతాలల్ల మొత్తం 543 పార్లమెంట్ స్తానాలున్నయి.. అండ్ల ఏదైనా పార్టీ 272కి పైగా సీట్లు గెలుచుకుంటే వాళ్లదే అధికారమన్నమాట..
మల్లన్న: మరీ (modi) మోడీ పార్టోళ్లు గెలువలేదా.. రాహుల్ పార్టీలొల్లు ఎన్నిగెలిసిర్రే..
రామన్న: మోడీ పార్టీ అంటే (Bjp) బీజేపీ .. పువ్వు గుర్తుకానీ ఇంకొన్ని పార్టీలతో కలిపి ఎన్డీఏ అని ఓ కూటమి ఏర్పాటు చేసుకున్నరు. అట్లనే రాహుల్ పార్టీ అంటే (Congress) కాంగ్రెస్ చేతి గుర్తు ఇళ్లు సుత ఇండియా (i.n.d.i.a) కూటమి అని ఏర్పాటు చేసుకున్నరు.
ఇగో గిట్ల రెండు కూటములు, ఇంకొన్ని పార్టీలు, కొంతమంది సతంత్రంగా పోటీకి దిగుర్రు.. అంతకుముందు 2014, 2019లో ఒక్కబీజేపీ పార్టీకే 272 దాటి సీట్లచ్చనయ్ కానీ. ఈ సారి 242 మాత్రమే అచ్చినయ్. కానీ ఇళ్లు పెట్టుకున్నకూటమిలోని పార్టీలతో కలుపుకుంటూ 292 సీట్లచ్చియినయ్…ఇగ ఇళ్లందరు కలిసి మళ్లామోడీనే ప్రధానమంత్రిగా ఎనుకున్నరు. (Chandrababu naidu) చంద్రబాబు పార్టీల గెలిచిన ఎంపీలు, నితీశ్ కుమార్ పార్టీల గెలిచినోళ్లతో కలుపుకుని (NDA) ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది.
ఇగ రాహులోల్ల పార్టీ కూటమికి కూడా 234 సీట్లచ్చినయ్ వాళ్లు సుతా దగ్గరదాకా అచ్చినట్టే.. ఇప్పటికిప్పుడయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవచ్చు..
మల్లన్న: మంచిగా చెప్పినవే రామన్న.. మంచిగ అర్థమయ్యింది.. ఇగ ఐదేండ్లదాక ఎలచ్చన్లు లేవాయే..
రామన్న: సర్పంచ్ యి సుతా పెడుతరట..
మల్లన్న: ఇగపోతనే.. ఇంత పత్తిపొరక కాలవెట్టి.. పొద్దుగూకి కలుత్తనే రామన్న..
మన పల్లెటూరి భాష, మన యాసలో అర్తమయ్యేట్టు వార్తలను చదివేందుకు.. ఫాలో డీసీ తెలుగు గూగల్ న్యూస్‌ను కింది రెడ్ కలర్లో ఉన్న ఫొటో క్లిక్ చేసి ఫాలో అవండి… లేదా వాట్సప్‌లో అని టైపు చేసి ఫాలో అవండి..
ఇవి కూడా చదవండి
Train Vrial Video” రైలుపక్కన సెల్ఫీ దిగాలని.. ప్రాణాలు పొగొట్టుకుని.. వీడియో వైరల్
Road accident” ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో ఎగిరిన పడ్డ షాకింగ్ లైవ్ సీసీటీవీ విజువల్స్..
Kurnool bus accident” ప్రయివేట్ వోల్వో బస్సు బోల్తా.. ఇద్దరు పిల్లలు మృతి
Road Accident”ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి ? ఆర్టీసీ ఎండీ వీడియో ట్వీట్ వైరల్