Warangal Crime news” ముక్కుపచ్చలారని పసిమనసులు..ఆటపాటలతో సాగాల్సిన బాల్యం.. కల్మషం లేకుండా సరదాగా సాగాల్సిన చిన్న వయస్సులో ఇంతటి ఘోర నిర్ణయం తీసుకోవడం కలవరపాటుకు గురిచేసింది.
ఎండలో ఆడుకోవద్దన్నందుకు ఒకరు.. నచ్చని (hair cutting) హెయిర్ కటింగ్ చేయించారని మరొక బాలుడు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ హృదయవిదాకర ఘటనలు ఉమ్మడి (warangal) వరంగల్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకున్నాయి. (warangal) వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మైసంపల్లికి చెందిన సిద్దు(9) మూడో తరగతి చదువుతున్నాడు. ఎండకాలం సెలవులు కావడంతో ఎండలో ఎక్కువగా తిరుగుతూ ఆడుకుంటున్నాడు. దీంతో ఎండలో తిరగొద్దని తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన సిద్దు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరో ఘటనలో మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలం చింతగూడెం గ్రామానికి చెందిన కాంతారావు చిన్న కుమారుడు హర్షవర్ధన్ (9) (hostel) హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. ఎండకాలం సెలవులకు ఇంటికి వచ్చాడు. కాగా, తండ్రి ఇష్టం లేని (hair cutting) హెయిర్ కటింగ్ చేయించాడని తండ్రితో వాగ్వాదానికి దిగాడు. కొద్దిసేపటి తరువాత హర్షవర్ధన్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన తల్లిదండ్రులు దవఖానాకు తరలించేలోపు మృతి చెందాడు. పిల్లల మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. రెండు ఘటనల్లోనూ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
heat waves” భానుడి భగభగలకు 24 గంటల్లో 54 మంది బలి
Kashmir Real Heros” నిజమైన హీరోలు.. నదిలో కొట్టుకుపోతున్న బాలుడిని కాపాడి యువకులు.. వీడియో వైరల్
vemulawada crime”లంకె బిందేలున్నాయని రూ. 30లక్షలు లక్షలు దోచారు
Road Accident”ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి ? ఆర్టీసీ ఎండీ వీడియో ట్వీట్ వైరల్
Bull Viral video” ఫోన్ ఆడిక్షన్ ప్రాణం మీదకు తెచ్చింది. కుళ్లపొడిచిన ఎద్దు.. వీడియో వైరల్
meteors”ఆకాశంలో అద్భుతం.. వెలుగులు విరజిమ్మిన ఉల్కలు.. వీడియో