Hanmakonda Viral news” 5 గంట‌లుగా చెరువులో శ‌వం ఉంద‌ని పోలీసుల‌కు ఫోన్.. బ‌య‌ట‌కు తీసేందుకు చేతిని ప‌ట్టుకోగానే షాక్

Hanmakonda Viral news

Hanmakonda Viral news”  ఐదుగంట‌ల నుంచి చెరువులో శ‌వం తేలుంద‌ని పోలీసుల‌కు ఫోన్ వ‌చ్చింది. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఆ చెరువు ద‌గ్గ‌ర‌కు చేరుకుని అందులో ఉన్న బాడీని బ‌య‌ట‌కు తీసేందుకు ప్ర‌య‌త్నించారు. చేతిని ప‌ట్టుకుని బ‌య‌ట‌కు తీస్తున్న క్ర‌మంలో ఒక్క‌సారిగా చెరువులో తేలుతున్న వ్య‌క్తి లేచి కూర్చున్నాడు. దీంతో అక్క‌డున్న (Police) పోలీసులు, స్తానికులు ఖంగుతిన్నారు. ఇదేంద‌య్యా ఇందులో ప‌డుకున్న‌వ‌ని అడుగ‌గా అత‌నిచ్చిన స‌మాధానం మ‌రింత షాక్ గుర‌య్యారు. ఈ విచిత్ర ఘ‌ట‌న హ‌న్మ‌కొండ‌లో సోమ‌వారం చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. (Hanmakonda) హనుమకొండ – రెడ్డిపురం కోవెలకుంటలో ఓ వ్యక్తి ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి 12 గంటల వరకు నీటిలోనే ఉన్నాడు.. అది గమనించిన స్థానికులు  (kU) కేయూ పోలీసులకు, 108 సిబ్బందికి సమాచారం అందిచారు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది, పోలీసులు ఆ వ్యక్తి మృతి చెంది ఉంటాడని భావించి బయటికిలాగేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలో అత‌ను బ‌తికే ఉన్నాడు. చెరువులో ఎందుకు ప‌డుకున్నావ్ అని అడ‌గ‌గా 10 రోజుల నుంచి (Granite) గ్రానైట్ క్వారీలో 12 గంటలు ఎండకి పని చేస్తున్నాన‌ని చెప్పాడు. వేడిని తట్టుకోలేక నీటిలో సేదతీరడానికి వచ్చానని పోలీసులకు తెలిపాడు. కాగా అతడు నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తిగా గుర్తించిన‌ట్టు స‌మాచారం. దీనికి సంబంధించిన వీడియోను తెలుగు స్క్ర‌యిబ్ వారు వారి ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.

ఇవి కూడా చ‌ద‌వండి

Train Vrial Video” రైలుప‌క్క‌న సెల్ఫీ దిగాల‌ని.. ప్రాణాలు పొగొట్టుకుని.. వీడియో వైర‌ల్

union ministers” కేంద్ర మంత్రులుగా ఐదుగురు తెలుగువారు..

Secunderabad accident” ఆగే ఓపిక లేక‌పోవ‌డం బాధాక‌రం.. సికింద్రాబాద్ యాక్సిడెంట్ స్పందిచిన ఆర్టీసీ ఎండీ..

Hair cutting Viral Video” హెయిర్ క‌టింగ్ కు ఇన్ని కొల‌త‌లా..? స్కేల్.. గుండుదారం..? వీడియో వైర‌ల్

Viral Video” ప‌ది ప‌రీక్ష‌లు ప‌దిసార్లు రాసి పాస‌య్యాడు.. బ్యాండ్ మేళంతో ఊరేగింపు.. వీడియో

Delhi Metro Viral Video”ఛీ.. ఛీ ఢిల్లీమెట్రోలో ఇదేం ప‌ని.. బెల్లీ డ్యాన్స్ వీడియో వైర‌ల్

meteors”ఆకాశంలో అద్భుతం.. వెలుగులు విర‌జిమ్మిన ఉల్క‌లు.. వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *