Bmtc Bus” డ్రైవ‌ర్ కు గుండెపోటు.. ప్ర‌యాణికుల‌ను కాపాడిన కండ‌క్ట‌ర్ .. వీడియో

Bmtc Bus” ప్ర‌యాణికుల‌ను తీసుకెళ్తున్న ఓ బ‌స్సు డ్రైవ‌ర్ కు మార్గ‌మ‌ధ్య‌లోనే గుండెపోటు వ‌చ్చింది. స్టిరింగ్ ప‌క్క‌న ఒరిగాడు. విష‌యాన్ని గ‌మ‌నించిన కండ‌క్ట‌ర్ ఓబులేష్ వెంట‌నే స్టీరింగ్‌పైకి వెళ్లి సమయస్ఫూర్తితో వ్యవహరించి బ‌స్సును నిలిపివేశాడు. ఈ ఘ‌ట‌న బెంగుళూరులో బుధ‌వారం చోటు చేసుకుంది.  బెంగుళూరుకు చెందిన బీఎంటీసీ బ‌స్సు నేల‌మంగ‌ళ నుంచి ద‌స‌నాపురాకు వెళ్తున్న‌ది. మార్గ‌మ‌ధ్య‌లో బ‌స్సు డ్రైవ‌ర్ కిర‌ణ్ కుమార్ గుండెపోటుకు గుర‌య్యాడు. స్టీరింగ్ ప‌క్క‌న కిర‌ణ్‌కుమార్ ఒర‌గ‌డాన్ని కండ‌క్ట‌ర్ ఓబులేష్ గ‌మ‌నించాడు. వెంట‌నే స్పందించిన కండ‌క్ట‌ర్ స్టీరింగ్‌పైకి వెళ్లి బ‌స్సును నిలిపివేశాడు. దీంతో బ‌స్సులో ఉన్న ప్ర‌యాణికులు, రోడ్డుపై వెళ్తున్న వారికి ఎటువంటి ప్ర‌మాదం చోటు చేసుకోలేదు. డ్రైవ‌ర్ కిర‌ణ్ కుమార్ మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఇదే వీడియోను తెలంగాణ ఆర్టీసీ ఎండీ ఎక్స్‌లో పోస్టు చేసి కండ‌క్ట‌ర్ కు వంద‌నాలు తెలిపారు.

ఇవి కూడా చ‌ద‌వండి

Noise Buds” నాయిస్ ఇయ‌ర్ బ‌డ్స్ పై భారీ త‌గ్గింపు..

07.11.2024 D. C Telugu Cinema

08.11.2024 D.C Telugu Cinema

Realme Phone” రీయ‌ల్ మి 5జీ ఫోన్ 12,498 రూపాయ‌ల‌కే..

Tiger Jump” పెద్దపులి లాంగ్ జంప్‌.. వీడియో వైర‌ల్

Gurugram accident” అదుపు త‌ప్పి అడ్డంగా దూసుకెళ్లిన కారు.. ఇద్ద‌రు స్టూడెంట్లు మృతి.. వీడియో

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *