Karimnagar News” ట్రస్మా చైర్మెన్, ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్‌రావు
యువతకు నిరుద్యోగ భృతితోపాటు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వచ్చేలా కృషి చేస్తానని ట్రస్మా చైర్మెన్, ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్‌రావు అన్నారు. ఉద్యోగ నియామకాల ప్రక్రియ త్వరగా జరిగేలా చూస్తానని ఆయన అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మిత్రుల ఆత్మీయ సమ్మేళనం రేకుర్తిలోని ఓ ప్రయివేట్ హాల్లో మంగళవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లాలోని ట్రస్మా నాయకులు, బాధ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శేఖర్ రావు మాట్లాడారు. 20 సంవత్సరాలుగా ప్రైవేట్ పాఠశాలలను నెలకొల్పి సేవలందిస్తున్నానని వివరించారు. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల పరిధిలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడిగా, గౌరవ సలహాదారుగా పర్యటించినట్టు చెప్పారు. తాను పలుజిల్లాల్లో పర్యటిస్తున్నప్పుడుమేధావులు, నిరుద్యోగులు, ప్రజలు పలు సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. ఆ సమస్యలను పరిష్కారించేందుకు కృషి చేస్తాని హామి ఇచ్చారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే మీ కుటుంబ సభ్యుడిగా ఉంటనన్నారు. పద్మశాలీ కులస్తులకు 10హెచ్ పీ కి బదులుగా 25 హెచ్‌పీ పవర్ లూమ్స్లను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు నిలిపివేశారని, దీని వల్ల సుమారు 20 వేల మంది నేతన్నల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ ప్రకటించిన ఉద్యోగులకు అందాల్సిన బెనిఫిట్స్ టైంకు అందడం లేదని వాపోయారు. సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాత పించన్ విధానం అమలు చేయాలని కోరారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి రూ. 10 లక్షల అమలయ్యేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడతనన్నారు. తన దగ్గర డబ్బులేదని, చివరిదాకా పోటీలో ఉండడని పలువురు విమర్శిస్తున్నానన్నారు. గెలుపొటములకు డబ్బుతో పనిలేదని చివరిదాకా ఉండి ఎమ్మెల్సీగా గెలువబోతున్నానని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మారెడ్డి, ట్రస్మా జగిత్యాల జిల్లా చీఫ్ అడ్వైజర్ మల్లేశం, పెద్దపల్లి జిల్లా ట్రస్మా అధ్యక్షులు కేశవరెడ్డి, కరీంనగర్ జిల్లా ట్రస్మా ఉపాధ్యక్షులు పచ్చునూరి సురేందర్, ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ కొత్త సతీష్, కరీంనగర్ కోశాధికారి రంగు శ్రీనివాస్, సిరిసిల్ల జిల్లా ట్రస్మా అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ గౌడ్ , మానకొండూరు మండల ట్రస్మా అధ్యక్షులు రవీందర్, పెద్దపల్లి ట్రస్మా కోశాధికారి ఓదెలు, జగిత్యాల జిల్లా తస్మా అధ్యక్షులు బోయినిపల్లి శ్రీధర్ రావు , కరీంనగర్ పట్టణ అధ్యక్షులు రావుల శ్రీనివాస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రైవేట్ విద్యాసంస్థల కరస్పాండెంట్లు పాల్గొన్నారు.
——————————————————————
ఐక్యూ ఫోన్లను అమెజాన్‌లో కొనేందుకు ఈ లింక్ ను క్లిక్ చేయండి… https://amzn.to/3UUkxbK
బోట్ ఇయర్ బాండ్స్ అమెజాన్‌లో 999 రూ.కే https://amzn.to/3Z9vd8J
ఇవి కూడా చదవండి
Cleaning Mop”మార్సూన్ మాప్… 10 సంవత్సరాల వారంటీతో.. ఇక సులభంగా తుడవొచ్చు..
Pushpa-2 trailer” పుష్ఫ-2 ట్రయిలర్ లో లాంచ్‌లో ఉద్రిక్తత.. ప్రేక్షలపై లాఠీచార్జ్
Electric Egg Boiler ఎగ్స్ ఉడకబెట్టేందుకు ఎగ్ బాయిలర్ కేవలం 369 రూపాయలే..
Digital Arrest News” డిజిటల్ అరెస్ట్ అంటూ రూ. 10 కోట్లు కొట్టేసిన నేరగాళ్లు..