Karimnagar” పుట్టినరోజు సందర్భంగా రోగులకు అల్పాహారం పంపిణీ చేసిన వీరస్వామి దంపతులు

శంకరపట్నం, కరీంనగర్ జిల్లా | డిసీ ప్రతినిధి

తనయుడి జన్మదిన తల్లిదండ్రుల సేవాభావం రోగులకు అల్పాహారం పంపిణీ చేసిన తల్లిదండ్రులు చేసినట్లు ఎల్సికే భగత్ నగర్ అధ్యక్షులు శ్రీగిరి శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. 

 సీనియర్ న్యాయవాది మరియు సామాజిక సేవాకర్త వీరస్వామి – పూజిత దంపతులు తమ కుమారుడు వినయ్ వర్ధన్ జన్మదినాన్ని పురస్కరించుకొని, కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మరియు వారి బంధువులకు అల్పాహారం పంపిణీ చేశారు.


సేవాధర్మం అందరికీ ఆదర్శం

ఈ సందర్భంగా ఎల్పీకే భగత్‌నగర్ అధ్యక్షుడు శ్రీగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ..

“వీరస్వామి పూజిత దంపతులు గతంలో సర్పంచ్‌, ఎంపీటీసీగా పనిచేసిన అనుభవంతో, న్యాయవాదిగా ప్రజలకు న్యాయం అందిస్తూ, ఇప్పుడు సామాజిక సేవలోను ముందంజలో ఉన్నారు. రోగులకు అల్పాహారం పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలు నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయి,” అని ప్రశంసించారు.


ఘన సన్మానం

ఈ సేవా కార్యక్రమాన్ని గుర్తిస్తూ వీరస్వామి దంపతులను శాలువాలతో సన్మానించారు. రోగుల బంధువులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు సంఘ సభ్యులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.


పాల్గొన్న ప్రముఖులు

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:

  • ఎల్పీకే భగత్‌నగర్ ఉపాధ్యక్షుడు మిట్టపల్లి విజయ నందన్

  • కోశాధికారి మామిడాల రమణ

  • జోనల్ చైర్‌పర్సన్ సిరిపురం ప్రసాద్

  • మిల్స్ అండ్ వీల్స్ బాధ్యులు రవీందర్ రెడ్డి కిషన్

  • వీరస్వామి కుటుంబ సభ్యులు, రోగుల బంధువులు తదితరులు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *