Viral Video” పోయిన ప్రాణాలు తిరిగి రావడమంటే ఇదేనేమో.. భూమ్మీద నూకలు ఉన్నాయి అందుకే బతికిబట్టకట్టారు అనే మాటలు అప్పడప్పుడు విని ఉంటాం. కానీ కొన్ని సార్లు అటువంటి వీడియోలు చూస్తాం. ద్విచక్రవాహనం పై త్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్ ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా కొందరి తీరు మారడం లేదు. తాజాగా రాంచీ-పట్నా హైవేలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ముగ్గురు యువకులు హెల్మెట్ లేకుండా స్పీడ్గా వెళ్తూ కారు, లారీ మధ్యలో దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. కారును ఢీకొట్టి కిందపడిపోయారు. లారీ చక్రాల కింద నలిగిపోతారనుకున్న టైంలో రెప్పపాటులో ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిపై ‘యమరాజ్ సెలవులో ఉన్నాడుస జోకులు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. వివరాల ప్రకారం, ఈ సంఘటన రాంచీ-పాట్నా హైవే వద్ద చోటు చేసుకుంది. కానీ ఎప్పుడు జరిగిందో స్పష్టంగా తెలియదు. ఈ వీడియోను ఇప్పటి వరకు లక్షల మంది చూశారు.
జస్ట్ మిస్.. రెప్పపాటులో ప్రాణాలు కాపాడుకున్నారు
బైక్పై త్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్తో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా కొందరి తీరు మారడం లేదు. తాజాగా రాంచీ-పట్నా హైవేలో ఇలాంటి ఘటనే జరిగింది. ముగ్గురు యువకులు హెల్మెట్ లేకుండా స్పీడ్గా వెళ్తూ కారు, లారీ మధ్యలో… pic.twitter.com/TP0hKhtw3l
— Mr Yash (@YashTDP_) February 17, 2025

ఇవి కూడా చదవండి
Amazon Offer” ఓయమ్మో.. 5 వేలల్లో స్మార్ట్ ఫోనా…? అమెజాన్‌లో…
Bank Jobs” ఎస్‌బీఐలో 2025 – 1,194 పోస్టలు.. కానీ రిటైర్ అయినవారు మాత్రమే అర్హులు
Up TrendingNews”కండ్లల్లో కారం చల్లి.. స్కూటీని ఎత్తుకెళ్లారు.. అందులో ఏముందంటే..
Amazon Offer” ఇంట్లోనే స్టేడియం బిగ్గర్ గేమ్.. బిగ్గర్ స్క్రీన్.. అమెజాన్ ఆఫర్ల బౌండరీలు
