Gondi Damesa” మార్చి 1న కుర్లీలో గొండీ డేమ్సా పోటీలు.. హాజ‌ర‌వునున్న మ‌హారాష్ట్ర‌, తెలంగాణ మంత్రులు

Gondi Damesa

Gondi Damesa”  – అంతరించిపోతున్న గిరిజన కళలను కాపాడేందుకు నిర్వహణ

– హాజరుకానున్న తెలంగాణ మంత్రి సీతక్క, మహారాష్ట్ర మంత్రి ఇంద్రనీల నాయక్ 

మహారాష్ట్రలోని యవత్ మాల్ జిల్లా ఘటాంజి మండలంలోని ఆదివాసీ ప్రధాన ప్రాంతమైన కుర్లీ లో మార్చి 1వ తేదీన గొండీ డేమ్సా పోటీలు నిర్వహించనున్నారు.  సాయంత్రం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోటీలకు తెలంగాణ నుంచి పలువురు ప్రముఖులు అతిథులుగా హాజరుకానున్నారు.  ఇందులో తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభిృద్ధి శాఖ మంత్రి, ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్కతో పాటు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు, కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంఛార్జ్ ఆత్రం సుగుణ, తెలంగాణ గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక్ తిరుపతి హాజరుకానున్నారు. అలాగే మహారాష్ట్ర గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి ఇంద్రనీల నాయక్ అతిథిగా విచ్చేయనున్నారు. అంతరించిపోతున్న ఆదివాసి గొండీ సమాజంలోని సంప్రదాయ డేమ్సా నృత్యం, వస్త్రధారణ, వాయిద్యాలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ డిజిటల్ యుగంలో గిరిజన సంస్కృతి, కళలను కాపాడుకునేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రధాన నిర్వాహకుడు ఆకాశ్ ఆత్రాం ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలకు తెలంగాణ రాష్ట్రంలోని గొండీ గాయకులు, గాయికలు హాజరుకానున్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చినవారికి బహుమతులు ప్రదానం చేయనున్నారు. ఇందులో మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ. 1 లక్ష నగదు బహుమతిని అందజేయనున్నారు. ఈ పోటీలో తెలంగాణ, మహారాష్ట్ర జిల్లాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకావాలని నిర్వాహకులు ఆకాశ్ ఆత్రాం, సర్పంచ్ సతీష్ రెడ్డి గడ్డమ్వార్, నిర్వహణ కమిటీ అధ్యక్షుడు దీపక్ సిద్ధాం వారు కోరారు.

 

మ‌రిన్ని క‌థ‌నాల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.. https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00

 

ఇవి కూడా చ‌ద‌వండి

Flying car”ఎగిరే కారును త‌యారు చేసిన అమెరికా కంపెనీ.. వీడియో

Amazon Offer” సాంసంగ్ నుంచి స్ట‌న్నింగ్ ఫోన్‌.. 5జీ ఏఐ స్మార్ట్ ఫోన్‌..

Viral news” ఈయ‌న స్పైడ‌ర్‌మ్యాన్ తాతలా ఉన్నాడు.. వైర‌ల్ వీడియో..

Noise Buds” నాయిస్ బ‌డ్స్ జ‌స్ట్ 799ల‌కే.. 50 గంట‌ల ప్లేటైం..

Intermediate Hall Tickets” వాట్స‌ప్‌లోనే ఇంటర్‌ హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ .. ఇంటర్‌ బోర్డు వెల్లడి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *