Chhaava Movie Review” విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో తెరకక్కిన ‘ఛావా రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే బీ టౌన్లో ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకోగా.. తాజాగా మరో మైలురాయిని చేరుకుంది. సినీ ఇండస్టీల్రో చరిత్ర సృష్టించిన ‘బాహుబలి 2’ రికార్డును అధిగ మించింది. దీంతో విక్కీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి 2’ అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినిమాకు గుర్తింపుతెచ్చింది. దేశవ్యాప్తంగానూ విడుదలైన అన్ని ప్రాంతాల్లో భారీ వసూళ్లు సొంతం చేసుకుంది. హిందీలో ఈ చిత్రం రూ.510 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇప్పుడీ కలెక్షన్లను ‘ఛావా’ అధిగమించింది. ఫిబ్రవరి 14న విడుదలైన ‘ఛావా’ ఇప్పటివరకూ బీ టౌన్లో రూ.516 కోట్లు వసూళ్లు చేసింది. దీంతో 25 రోజుల్లోనే బాలీవుడ్లో ‘బాహుబలి 2’ రికార్డును అధిగమించి చరిత్ర సృష్టించింది. అంతేకాదు హిందీ చలనచిత్ర చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ఆరో సినిమాగా ‘ఛావా’ నిలిచింది. మరోవైపు ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి సోషల్ విూడ ియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీని డిజిటల్ హక్కుల ను నెట్‌ప్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. థియేటర్లో సూపర్‌హిట్‌గా నిలిచిన ఈ చిత్రం ఏప్రిల్ 11 నుంచి స్టీమ్రింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి . త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందంటూ పోస్ట్‌లు షేర్ అవుతున్నాయి. ఈ చిత్రం ఓటీటీ విడుదలయ్యాక అక్కడ కూడా రికార్డులు నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తోంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్ ఆయన భార్య యేసుబాయి భోంస్లే పాత్రలో రష్మిక జీవించేశారు.
Peddapalli” 436 రూపాయల ప్రీమియం తో 2 లక్షల బీమా: పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష..
Cinema News” ఆ మార్క్‌ను దాటిన సంక్రాంతికి వస్తున్నాం..
Manchu Vishnu”ఇంజిన్‌లో చక్కెర పోస్తే మైలేజ్ పెరుగుతుంది.. మంచు విష్ణు ఆన్సర్..
Cinema News” టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనున్న సోనాక్షి..?
Amazon Offer” ఎలక్ట్రిక్ లైటర్‌తో దేన్నైనా వెలిగించొచ్చు.. కొవ్వొత్తి, బాణా సంచాలను కూడా
