24.03.2025 శంక‌ర‌ప‌ట్నం వార్త‌లు

శంకరపట్నం ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా రమేష్…
ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్…
జిల్లా ఈసీ మెంబర్ స్వామి…
శంకరపట్నం డిసి ప్రతినిధి
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఐజేయు శంకరపట్నం ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా జక్కోజు రమేష్ ఏకగ్రీవంగా నియామకమైనట్టు జిల్లా ఈసీ మెంబర్ గాజుల స్వామి ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలం, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమావేశాన్ని జిల్లా అధ్యక్షులు గాండ్ల శ్రీనివాస్ ఆదేశం మేరకు మొలంగూర్ శివారులోని శ్రీ లక్ష్మీ ప్రసన్న గార్డెన్స్ లో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మండల జర్నలిస్టుల సమావేశం నిర్వహించి, అధ్యక్షులుగా జక్కోజు రమేష్, ప్రధాన కార్యదర్శిగా మాతంగి శ్రీనివాస్, కోశాధికారిగా మోతే సదానందం, సలహాదారునిగా బుర్ల రాజు, ఉపాధ్యక్షులుగా దామెర సతీష్, బుర్ర సత్యనారాయణ, గొట్టి అర్జున్, సహాయ కార్యదర్శిగా దేవునూరి రవీందర్, నియామకం చేసినట్లు స్వామి తెలిపారు. ఈ సమావేశంలో మండల జర్నలిస్టులు, కొరిమి సంతోష్, కాశీపాక సంపత్, తిరుపతి రెడ్డి, దేవునూరి అంకుష్, మేడిశెట్టి భూమయ్య, తదితరులు పాల్గొన్నారు

////////////////////////////////////////////////////////////////////////////////

పెద్దమ్మ తల్లికి ఎమ్మెల్యే కవ్వంపల్లి ప్రత్యేక పూజలు…
శంకరపట్నం డిసీ ప్రతినిధి
పెద్దమ్మతల్లికి మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కమ్మపల్లి సత్యనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, తిమ్మాపూర్ మండల కేంద్రంలో జరుగుతున్న పెద్దమ్మతల్లి బోనాల జాతరలో ఆదివారం మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. జాతరలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సుధగోని లక్ష్మీనారాయణ, గోపు మల్లారెడ్డి, మామిడి అనిల్ కుమార్, కుంట రాజేందర్ రెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాసరావు, నందగిరి రవీంద్ర చారి, కాలువ మల్లేశం, కొత్త తిరుపతిరెడ్డి, కొండలరావు,బుదారపు శ్రీనివాస్, పోలు రాము, ఎల్లారెడ్డి, రమేష్, తమ్మన వేణి రమేష్ కుమార్ యాదవ్, బండారు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

////////////////////////////////////////////////////////

రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక చర్యలు…
ఎస్సై కొత్తపల్లి రవి…
శంకరపట్నం డిసి ప్రతినిధి
జాతీయ రహదారిపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నిర్వహణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు కేశవపట్నం ఎస్ఐ కొత్తపల్లి రవి ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై రవి మాట్లాడారు. కేశవపట్నం బస్టాండ్ ఎదురుగా జాతీయ రహదారిపై, మరికొన్ని ప్రదేశాల్లో ప్రమాదాల నివారణ కోసం జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలో స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేసి, ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఎస్సై రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ అధికారులు సిబ్బంది తదితరులు ఉన్నారు.

*///////////////////////////////////////////////////////

మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు..
మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి ..
శంకరపట్నం డిసి ప్రతినిధి
పవిత్ర రంజాన్ మాసాంతం వరకు ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయతకు, మత సామరస్యానికి ప్రతీక అని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం,శంకరపట్నం మండల కేంద్రంలోని మాధవ సాయి గార్డెన్ లో ముస్లిం సోదరుల కోసం ఆయన ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సత్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరై సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఫలహారాలు తినిపించి, ఉపవాస దీక్ష విరమింపజేశారు. అనంతరం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ అన్ని మతాల సారం ఒక్కటేనని, మనషులంతా సోదర భావంతో కలిసి మెలిసి ఉండాలని ఆకాంక్షించారు.
ఈ ఇఫ్తార్ విందులో శంకరపట్నం మండలం తహసిల్దార్ భాస్కర్, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బత్తిని శ్రీనివాస్ గౌడ్, గోపగోని బసవయ్య గౌడ్, హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి, మానకొండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు గాజుల వెంకటేశ్వర్లు, బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కవ్వపద్మ శ్రీనివాసరెడ్డి, మానకొండూర్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మొహమ్మద్ షారుక్, సదానందం, బండారి తిరుపతి ఎండి జహంగీర్, ఇస్సాముద్దీన్ షారుక్, అమీర్, ముస్లిం మత పెద్దలు కాజా మోహినిద్దీన్, వాజిద్, మోయిన్ రియాజ్ ,తోపాటు వివిధ గ్రామాల నుంచి ముస్లిం సోదరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *