Current Affairs” సునీతా విలియ‌మ్స్ అంత‌రిక్ష ప్ర‌యాణంపై క‌రెంట్ ఎఫైర్స్‌.. పోటీ ప‌రీక్ష‌ల ప్ర‌త్యేకం

Current Affairs”  9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్‌మోర్‌ సురక్షితంగా భూమి విూద దిగారు.
డ్రాగన్‌ క్రూ కాప్సూల్ అనే నౌకా ఫ్లోరిడా తీరానికి సవిూపంలోని సముద్రజలాల్లో పారాషూట్‌ల సాయంతో భూమ్మీద‌కు సురక్షితంగా దిగారు.
సునీతా, బుచ్ విల్మోర్‌లతో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు కూడా వచ్చారు.
తొలుత సునీతా, బుచ్‌ను నాసా సిబ్బంది జాగ్రత్తగా క్యాప్సూల్‌ నుంచి బయటకు తీసుకొచ్చారు.
ఐఎస్‌ఎస్‌లోని సూక్ష్మ‌స్థాయి గురుత్వాకర్షణ శక్తిలో ఎక్కువ సమయం గడిపినందుకు ఇద్దరు వ్యోమగాములు బలహీనంగా మారారని నిపుణులు చెబుతున్నారు.
అంత‌రిక్షంలో ఎక్కువ కాలం గ‌డిపినందుకు కండరాలు క్షీణించడం, సరిగా నిలబడలేక బ్యాలెన్స్‌ కోల్పోవడం వంటి సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఇక సునీతా విలియమ్స్‌ ల్యాండింగ్‌కు సంబంధించి 2013లో వచ్చిన హాలీవుడ్‌ మూవీ గ్రావిటీ- సినిమాకు గుర్తుకుతెచ్చింది. 2013లో హాలీవుడ్‌ నుంచి వచ్చిన సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం గ్రావిటీ.
ఈ సినిమాలో హాలీవుడ్‌ హీరోయిన్‌ సాండ్రా బుల్లక్‌ కథానాయికగా నటించగా.. అల్ఫోన్సో కారోన్‌ దర్శకత్వం వహించాడు.

సునీతా విలియ‌మ్స్‌తోపాటు మిగిలిన వ్యోమ‌గాముల‌ను ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం వారిని హ్యూస్టన్‌లోని జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌కు తరలించారు.

అంతరిక్షంలో వ్యోమగాముల అనుభవాలను కూడా నాసా రికార్డు చేయనుంది. సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉన్న సమయంలో ఎదురైన సవాళ్లు, అనుభవాలు వంటివన్నీ తెలుసుకుని నాసా అధికారులు రికార్డు చేసుకుంటారు.

భూవ్మిూదకు వచ్చాక తాను ముందుగా కుటుంబసభ్యులతో పాటు పెంపుడు శునకాలను కూడా చూడాలనుకుంటున్నట్టు- సునీతా విలియమ్స్‌ ఇటీవల పేర్కొన్నారు.
గతేడాది బోయింగ్‌ స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో ఎనిమిది రోజుల అంతరిక్ష యాత్ర కోసం వెళ్లిన ఇద్దరు వ్యోమగాముల సాంకేతిక సమస్యల కారణంగా అక్కడే తొమ్మిది నెలల పాటు- చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.

 

మ‌రిన్ని ఎడ్యుకేష‌న్ వార్త‌ల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.. https://whatsapp.com/channel/0029Vay6cIbG8l56gc8Fz71e

 

The crashed plane” గాల్లో ప‌ల్టీలు కొడుతూ కులిన విమానం… వీడియో వైర‌ల్

Current Affairs” ఈశాన్య రాష్ట్రంలోని న‌గ‌రం పేరుతో ఉన్న యుద్ద‌నౌక ఏదీ..? పోటీ ప‌రీక్ష‌ల ప్ర‌త్యేకం

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *