The crashed plane” సరుకులు రవాణా చేసే కార్గో విమానం కుప్ప కూలింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్నది. కెన్యాకు చెందిన విమానం సోమాలియాలోని మొగడిషు సమీపంలో కూలిపోయింది. ఇందులో ఐదుగురు మృతి చెందినట్టు సమాచారం.. ఈ ఘటన చోటు చేసుకుంది శనివారం కాగా, ఆదివారం సోమాలి సివిల్ ఏవియేషన్ అథారిటీ (SCAA), ఒక ప్రకటనలో పేర్కొంది. కార్గో విమానం ఆఫ్రికన్ యూనియన్ దళాలకు సామాగ్రిని పంపిణీ చేసిన తర్వాత లోయర్ జుబా ప్రాంతంలోని ధోబ్లే పట్టణం నుండి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మార్చి 22, శనివారం సాయంత్రం 5:43 గంటలకు కూలిపోయిందని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి.
మొగడిషుకు నైరుతి దిశలో దాదాపు 24 కి.మీ దూరంలో విమాన ప్రమాదం జరిగిందని నిర్ధారించింది. ఈ విమానం DHC-5D బఫెలో, సీరియల్ నంబర్ 109 మరియు రిజిస్ట్రేషన్ 5Y-RBA. SCAA ప్రకారం, ఈ విమానాన్ని ట్రైడెంట్ ఏవియేషన్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. ఇందులో ఐదుగురు వ్యక్తులు ఉన్నారు, విమానం ధోబ్లే (HCDB) నుండి బయలుదేరి అడెన్ అబ్దుల్లె అంతర్జాతీయ విమానాశ్రయం (HCMM)కి వెళుతోంది” అని ప్రకటనలో పేర్కొంది.
కెన్యా విమానం సోమాలియాలో కుప్పకూలింది.
కెన్యాకు చెందిన DHC-5D బఫెలో కార్గో విమానం మొగదిషు వద్ద కూలిపోగా, ఐదుగురు దుర్మరణం పాలయ్యారు.
ధోబ్లే నుంచి మొగదిషుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.#FlightCrash pic.twitter.com/ghImBVZIjj
— greatandhra (@greatandhranews) March 23, 2025
ఇవి చదవండి
Power Plant In Rajasthan” సీఐఎస్ఎఫ్ వాహనాన్ని ఢీకొట్టిన గూడ్స్ రైలు…. వీడియో
Rajiv Yuva Vikasam”రాజీవ్ యువవికాసం రాయితీ లోన్లకు కావాల్సిన పత్రాలివే. వర్తించే యూనిట్లు ఇవే…
Bus accident” బైక్ తప్పించబోయి.. బోల్తా పడ్డ బస్సు.. వీడియో
Cinema News” నిన్నటి నుంచి ట్రెండింగ్.. టాలీవుడ్‌ను ఏలేదీ ఆ అమ్మాయే
Amazon” ఏదైనా వస్తువుపోయినా.. ఎక్కడైనా మరిచిపోయి… ఇది వెతికి పట్టిస్తోంది..
Bank jobs”బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (BOI) అప్రెంటిస్ 400 పోస్టులకు రిక్రూట్మెంట్
