Nasa” నాసా బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఒక్క ఐడియా చెప్పండి 25 కోట్ల రూపాయలు అందుకోండి అని ప్రకటించింది. ఇంతకీ ఏం ఐడియా.. దేని గురించో ఈ వీడియోలో తెలుసుకుంది. జాబిల్లిపై ఏనాటి నుంచో ప్రయోగాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే చంద్రుడిపై పేరుకుపోయిన మానవ వ్యర్థాలను తొలగించడం లేదా రీసైక్లింగ్ చేసేందుకు పరిష్కారం చెప్పాలని అమెరికా అంతరిక్ష సంస్థ అయిన నాసా సూచించింది. వినూత్న పరిష్కారం చెప్పిన వారికి 3 మిలియన్ డాలర్లు ఇస్తామని ప్రకటిచింది. అంటే భారత కరెన్సీలో 25 కోట్ల రూపాయలు..
అపోలో మిషన్ ద్వారా నాసా.. 1969వ సంవత్సరం నుంచి 1972 మధ్యకాలంలో అస్ట్రోనాట్స్‌ను పలు పరిశోదనల కోసం చంద్రుడిపైకి పంపింది. ఈ పరిశోధనల కోసం వెళ్లిన వ్యోమగాములు చందమామ నుంచి నమూనాలను భూమిపైకి పట్టుకొచ్చారు. భూమిపైకి తీసుకొస్తున్న క్రమంలో నమూనాలకు చోటు కల్పించేందుకు అనవసర వస్తువును బయటకు పడేశారు. వీటిలో ఎక్కువగా మానవ వ్యర్థాలే ఉన్నాయని నాసా ఇటీవల ప్రకటించింది. మానవ వ్యర్థాలను చిన్న చిన్న బ్యాగుల్లో ఉంచి చంద్రుడిపైన పడేశారని తెలిపింది. మొత్తంగా 96 సంచుల వ్యర్థాలు జాబిల్లిపై ఉన్నాయని పేర్కొంది. ఆ సంచులను అక్కడి నుంచి తొలగించే అవసరం ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న అమెరికా అందరిక్ష పరిశోధన సంస్థ ఈ స్పెషల్ ఆఫర్ ను ఇచ్చింది. దీనిని ‘లూనా రీసైకిల్ ఛాలెంజ్స అనే పేరుతో ప్రారంభించింది. అయితే ఈ వ్యర్థాలను నీరు, శక్తి, ఎరువుగా మార్చే ప్రక్రియలకు నూతన పరిష్కారాలు ఇవ్వాలని కోరింది. రానున్న రోజుల్లో చంద్రుడి మీదకు మానవులను తీసుకెళ్లనున్నారు. అయితే జాబిల్లిపై వారి జీవన విధానాన్ని మెరుగుపరచేందుకు మీరు ఇచ్చే ఆలోచన ఎంతో కీలకం అవ్వనున్నట్టు తెలుస్తోంది.
China Bridge”ఇంతకు ముందు గంట ప్రయాణం.. ఇప్పుడు నిమిషంలోనే చేరుకోవచ్చు
Samsung Galaxy” సాంసంగ్ నుంచి రెండు అద్బుతమైన ఫోన్లు.. వివరాలు పరిశీలించండి..
Camera” కెమెరాలు, కెమెరా డివైస్‌లపై భారీ తగ్గింపు.. పరిశీలించండి.. కొనండి..
Jr Ntr” జపాన్‌లో ఎన్టీఆర్ సందడి.. వీడియో
