Elon musk” టెక్ మాంత్రికుడు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన కీలక పన్ను-ఖర్చుల బిల్లుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ బిల్లును విమర్శిస్తూ, ఇది ఆమోదం పొందితే “అమెరికా పార్టీ (America Party)” అనే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తానని మస్క్ హెచ్చరించారు.
అత్యంత వివాదాస్పదంగా మారిన “One Big, Beautiful Bill” పై సోమవారం సెనేట్‌లో చర్చ కొనసాగుతుండగా, మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X (మునుపటి Twitter) లో స్పందించారు:
“ఈ బిల్లు వల్ల దేశం పది సంవత్సరాల్లో $3.3 ట్రిలియన్ మేర అప్పులో కూరుకుపోతుంది. ఇది ప్రజలను ఆదుకునే పార్టీ కాదు, ఇది ‘పోర్కీ పిగ్ పార్టీ’! ప్రజల కోసం కొత్త పార్టీ అవసమని పేర్కొన్నారు.
మస్క్ గతంలో ట్రంప్‌కు మద్దతు ఇచ్చి, ఆయన ప్రచారానికి $250 మిలియన్‌కు పైగా విరాళాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ ఖర్చులపై విభేదాల నేపథ్యంలో ఇద్దరి మధ్య బంధం దెబ్బతింది.
రిపబ్లికన్లపై మస్క్ విరుచుకుపడ్డారు
ఈ బిల్లుపై అసంతృప్తితో మస్క్, రిపబ్లికన్ నేతలపైనా మండిపడ్డారు.
“ఋణాన్ని తగ్గిస్తాం అని ఎన్నికల్లో చెప్పి, చరిత్రలోనే అతిపెద్ద డెట్ సీలింగ్‌ను ఆమోదించే బిల్లుకు ఓటేస్తారా..? ఇది ప్రజల నమ్మకానికి ద్రోహం.”
“ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన ప్రతి సభ్యుడు వచ్చే ఎన్నికల్లో తమ సీటును కోల్పోతారు. ఇది నా చివరి పని అయినా సరే.” అని మస్క్ హెచ్చరించారు.
ట్రంప్‌తో సంబంధ విరగడం
ఒకానొక కాలంలో ట్రంప్‌తో మస్క్ రాజకీయ భాగస్వామిగా ఉన్నారు. మస్క్‌కు “Department of Government Efficiency” చీఫ్‌గా పదవీ బాధ్యతలు అప్పగించారు. కానీ ప్రభుత్వ ఖర్చులపై విభేదాలతో ఆ బంధం ముగిసింది.

