మాజీ ప్రియుడిని గంజాయి కేసులో ఇరికించి జైలుకు పంపించేందుకు ఓ యువతి పన్నిన పన్నాగం బెడిసి కొట్టింది. పోలీసు విచారణలో ఆమె దొరికి పోయింది. హైదరాబాద్ లో చోటుచేసుకున్న ఈ ఘటనలో అసలు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. రహమత్‌నగర్‌లో నివాసముంటున్న రింకీ.. అవిూర్‌పేటలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తోంది. సరూర్‌నగర్‌కు చెందిన శ్రవణ్ కూడా అదే ప్రాంతంలో పనిచేస్తున్నాడు. వీరిద్దరూ కొంతకాలం ప్రేమించుకున్నారు. ఆ తర్వాత శ్రవణ్ ఆమెను దూరం పెడుతూ వచ్చాడు. దీంతో అతనిపై కక్ష పెంచుకున్న రింకీ.. ఎలాగైనా అతడిని జైలుకు పంపి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. పథకం ప్రకారం.. తన స్నేహితులతో కలిసి మంగళ్‌హాట్‌లో రూ.4 వేలకు 40 గ్రాముల గంజాయి కొనుగోలు చేసింది. 8 గ్రాముల చొప్పున ఐదు ప్యాకెట్లు తయారుచేసి తన వద్ద పెట్టుకుంది. తన స్నేహితులతో శ్రవణ్‌కు ఫోన్ చేయించి.. అవిూర్‌పేట సవిూపంలోని ఓ పార్క్ వద్దకు రప్పించింది. ఆ తర్వాత రింకీ, ఆమె స్నేహితులు, శ్రవణ్‌తో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌కు వెళ్లారు. అందరూ పబ్‌లో ఉన్న సమయంలో రింకీ.. తనకు తెలిసిన ఓ కానిస్టేబుల్‌కు ఫోన్ చేసి.. శ్రవణ్ అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నారు, ఫలానా నంబరు కారులో గంజాయి ప్యాకెట్లు ఉన్నాయని చెప్పింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారును తనిఖీ చేయగా గంజాయి పొట్లాలు లభ్యమయ్యాయి. వెంటనే శ్రవణ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. కారు నాది కాదు, వేరే వాళ్ల కారులో వచ్చానని చెప్పాడు. దీంతో కారులో వచ్చిన వారందరినీ పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం వెలుగుచూసింది. తనను దూరం పెట్టాడనే కక్షతోనే మాజీ ప్రియుడు శ్రవణ్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని రింకీనే ఇదంతా చేసిందని పోలీసులు తేల్చారు. ఈ కేసులో రింకీతో పాటు ఆమెకు సహకరించిన మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
దేశవ్యాప్తంగా 412 పాజిటివ్ కేసులు నమోదు