పాకిస్థాన్‌లో సాధారణ ఎన్నికలకు వేలయ్యింది. వచ్చే ఫిబ్రవరి 8 న అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే ఎన్నికల్లో తొలిసారి హిందూ మహిళ పోటీచేయనున్నది. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి చేసేందుకు, అభివృద్ధి రంగాల్లో మహిళల పాత్రను పెంచేందుకు పాటుపడుతానంటున్నారు. మహిళల హక్కులను కాపాడేందుకు ప్రాతినిధ్యం వహిస్తానని చెప్తున్నారు. డాక్టర్ సవీరా ప్రకాష్. అయితే గతవారం బునెర్ జిల్లాలో పాకిస్తాన్ పీపుల్ పార్టీ నుంచి టికెట్ కోసం నామినేషన్ దాఖలు చేశారు. ఫిబ్రవరి 8న పాకిస్థాన్ 16వ జాతీయ అసెంబ్లీ సభ్యులను ఎన్నుకునేందుకు ఎన్నికలు నిర్వహించనున్నారు. హిందూ కమ్యూనిటీకి చెందిన డాక్టర్ సవీరా ప్రకాష్ ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బునెర్ జిల్లా నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. దీంతో ఈమె పాకిస్థాన్‌లో హిందువుల నుంచి మొదటిసారి పోటీ చేస్తున్న మహిళగా చరిత్ర సృష్టించనున్నారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నుంచి పీకే-25 జనరల్ సీటుకు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. సవీరా ప్రకాష్ వ్యక్తిగత జీవితానికొస్తే 2022లో ఖైబర్ పఖ్తుంఖ్వాలోని అబోటాబాద్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ప్రస్తుతం సవీరా ప్రకాష్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మహిళా విభాగం బునెర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లోపు ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి.. ఎంపీ బండి సంజయ్
అయితే సవీర్ ప్రకాష్ తన తండ్రి ఓవమ్ ప్రకాష్ ను ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లో వచ్చినట్టు తెలుస్తోంది. తన తండ్రి 35 ఏండ్లు డాక్టర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన కూడా పీపీ పార్టీలో సభ్యులుగా ఉన్నారు. సమాజ సేవ, మహిళల హక్కులను కాపాడేందుకు, అభివృద్ధి రంగంలో మహిళల పాత్రను పెంచేందుకు రాజకీయాల్లోకి వస్తున్నట్టు తెలుస్తోంది. వెనుకబడిన ప్రాంతాల కోసం పని చేస్తూ తన తండ్రి అడుగుజాడల్లో నడవాలన్నదే తన కోరిక అని చెప్పుకొచ్చారు.
బస్సుముందు ఘోరంగా కొట్టుకున్న మహిళలు .. కారణమేంటో