Ai Hanuman movie” ఎఐ టెక్నాలజీతో హనుమాన్ మూవీ – భారీ స్థాయిలో తెరకెక్కనుంది

Ai Hanuman movie”

ప్రస్తుతం సినిమా పరిశ్రమలో పురాణ కథలకు గిరాకీ భారీగా పెరుగుతోంది. అంతేకాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం కూడా అన్ని రంగాల్లో వేగంగా విస్తరిస్తోంది. టెక్నాలజీ, ఆరోగ్య, విద్య, వ్యాపారం, వినోదం ఇలా ఎన్నో రంగాల్లో AI కీలకపాత్ర పోషిస్తుండగా, సినిమా రంగంలోనూ దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

ఇప్పటికే కొన్ని చిన్న యానిమేటెడ్ ఫిలిమ్స్‌ ద్వారా ప్రయోగాలు చేసినవారు, ఇప్పుడు బాలీవుడ్‌లో ఒక భారీ AI ఆధారిత చిత్రం నిర్మాణ దశలో ఉంది. ఈ ప్రాజెక్ట్‌ పేరు ‘చిరంజీవి హనుమాన్’. శక్తి, భక్తి, ధైర్యానికి నిదర్శనంగా నిలిచిన శ్రీ హనుమంతుని జీవితాన్ని ఆధునిక సాంకేతికతతో, పూర్తిగా AI ఆధారంగా రూపొందించనున్నారు.

ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో పేరుగాంచిన నిర్మాతలు విక్రమ్ మల్హోత్రా మరియు విజరు సుబ్రహ్మణ్యం కలిసి నిర్మిస్తున్నారు. అత్యాధునిక గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్ టెక్నిక్స్ ఉపయోగించి, అంతర్జాతీయ నిపుణుల సాయంతో హనుమంతుని పాత్రను ఇప్పటివరకు చూడనటువంటి రీతిలో మలచనున్నారు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌ పోస్టర్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచింది. ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం హనుమాన్ జయంతి సందర్భంగా థియేటర్లలో విడుదల చేయాలన్నది మేకర్స్ లక్ష్యం. ఇది సాంప్రదాయ మిథాలజీ సినిమాకు మించిన, భిన్నమైన, సాంకేతికంగా ముందడుగు వేసిన ప్రయోగాత్మక చిత్రం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *