Bharathiyudu”భారతీయుడు 2′ ట్రైలర్‌ రిలీజ్‌ కోసం ప్లాన్‌

Bharathiyudu"

Bharathiyudu” కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ డైరెక్ష‌న్‌లో తెరకెక్కుతోన్న సినిమా ‘భారతీయుడు 2. గ‌తంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లోనే వచ్చిన హిట్ చిత్రం ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా దీనిని తెర‌కెక్కించ‌నున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని అంశాలు సోషల్‌ విూడియాలో వైరల్‌గా మారాయి. మూడో భాగంపై కూడా న్యూస్ వస్తుండడంతో సినీ ప్రియులు సంతోష పడుతున్నారు. ‘భారతీయుడు 2’తో పాటే మూడో భాగాన్ని కూడా సిద్ధం చేస్తున్నట్టు టీమ్‌ ఇప్పటికే చెప్పిన విష‌యం తెలిసిందే. పార్ట్‌ 3కు సంబంధించిన చిత్రీక‌ర‌ణ శంకర్‌ కంప్లీట్‌ చేసినట్లు స‌మాచారం. ఈ రెండు చిత్రాలను ఈ ఏడాదిలోపే విడుదల చేయాలని సినిమా యూనిట్ భావిస్తున్న‌ది. ‘భారతీయుడు 2’ ట్రైలర్‌ రిలీజ్‌ కోసం చిత్ర బృందం ఓ భారీ ఈవెంట్‌ను రెడీ చేస్తోందట. ఇప్పటికే పనులు పూర్తయినట్లు వినికిడి. జూన్ నెల‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న‌ట్టు సినిమా యూనిట్ గతంలోనే పేర్కొంది. 1996వ సంవ‌త్స‌రంలో శంకర్ డైరెక్ష‌న్లో వచ్చిన ఈ ‘భారతీయుడు’. సినిమా సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ మరోసారి ప్రేక్షకుల‌ను అల‌రించేందుకు సిద్ధమైంది.

ఇవి కూడా చ‌ద‌వండి

Rajanna Siricilla Crime news”పిగుడుపాటుకు ఇద్దరు మృతి

Bull Viral video” ఫోన్ ఆడిక్ష‌న్ ప్రాణం మీద‌కు తెచ్చింది. కుళ్ల‌పొడిచిన ఎద్దు.. వీడియో వైర‌ల్

Double e Smart” డబుల్‌ ఇస్మార్ట్‌ టీజర్ రిలీజ్

North korea” రెడ్ క‌ల‌ రెడ్ క‌ల‌ర్ లిప్‌స్టిక్‌పై ఉత్త‌ర కొరియాలో నిషేధం

Water Video Viral” నీటి ఒత్తిడికి గాల్లో లేచిన జేసీబీ వీడియో వైర‌ల్

Munner river”అయ్యో దేవుడా.. ఈత స‌ర‌దా.. తీసింది ప‌సివాళ్ల ప్రాణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *