Asha Workers” నెలసరి వేతనం 18 వేల రూపాయలు అందించాలి..
మండల అధ్యక్షురాలు రాజమణి..
శంకరపట్నం: డిసీ ప్రతినిధి
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆశా కార్యకర్తలకు ఉద్యోగ భద్రత కల్పించి నెలసరి శ్రమకు తగ్గ వేతనంగా 18 వేల రూపాయల వేతనాన్ని అందించాలని మండల ఆశా కార్యకర్తల సంఘం అధ్యక్షురాలు రామగిరి రాజమణి ప్రభుత్వాన్ని కోరారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం ఆశా కార్యకర్తల సంఘం ఆధ్వర్యంలోమంగళవారం మండల వైద్యాధికారి సురేష్ కు వినతి పత్రాన్ని అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాజమణి మాట్లాడారు. 2023లో ఆశా కార్యకర్తల అనుబంధ సంఘమైన సిఐటియు ఆధ్వర్యంలో చర్చలు జరిగాయని, చర్చల సమయంలో ప్రభుత్వము ఆశా కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చి నేటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని, ఆశా కార్యకర్తలకు శ్రమకు తగ్గ వేతనం అందడం లేద న్నారు. ఆశ వర్కర్లు గ్రామాల్లో ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ రోగాల బారిన పడి మృతి చెందిన ఘటనలు ఉన్నాయని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ఆశా కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను సత్వరమే పరిష్కరించి, నెలసరి వేతనంగా 18 వేల రూపాయలతో పాటు ఉద్యోగ భద్రత కల్పించి, ఆశా కార్యకర్తలకు 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్, తోపాటు ఈఎస్ఐపిఎఫ్ సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మండల వైద్యాధికారికి సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. పి లలిత, స్వప్న, సులోచన, డి స్వరూప, కోమల, స్వప్న, రాధా, లక్ష్మీ, విజయ, సౌందర్య, పుష్పలత ,మల్లేశ్వరి, విజయ, సులోచన, సుజాత తో పాటు వివిధ గ్రామాల ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

️ మీ వంటింటికి సరికొత్త సహాయకుడు వచ్చేశాడు!
HeeMo 6-in-1 గ్రేటర్ & స్లైసర్ – మల్టీకలర్
వివరాలు:
✅ మటీరియల్: BPA-free హెవీ డ్యూటీ ABS ప్లాస్టిక్
✅ బ్లేడ్స్: స్టెయిన్లెస్ స్టీల్ షార్ప్ బ్లేడ్స్
✅ 6 జోడింపులు: స్లైసింగ్, గ్రేటింగ్, జల్లి, థిక్ & ఫైన్ కట్
✅ సక్షన్ బేస్: క్లీన్ సర్ఫేస్‌కి సులభంగా అంటుతుంది
✅ డిష్‌వాషర్ సేఫ్ – శుభ్రపరచడం చాలా సులభం
✅ సైజు: 15x15x5 సెం.మీ.
పండ్లు, కూరగాయలు, చీజ్, నట్స్ – ఈ ఒక్క టూల్‌తో అన్నీ సులభం!
❌ కత్తితో ముక్కలు ముక్కలు కోయడం ఇక మానండి…
✅ త్వరగా, సురక్షితంగా, సమయాన్ని ఆదా చేస్తూ వంట చేయండి!
కేవలం రూ. 125 కే
అమెజాన్లోబుక్ చేసేందుకు https://amzn.to/45SgaUh లింక్ పై క్లిక్ చేయండి..
