Baloch liberation” క్వెట్టా, కాలాత్ ప్రాంతాల్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ఇటీవల మరోసారి పాక్ సైన్యంపై భారీ దాడులు నిర్వహించింది. బీఎల్ఏ సంస్థ ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ దాడుల్లో 29 మంది ప్రాణాలు కోల్పోయారు, వీరిలో పాక్ సైనికులు కూడా ఉన్నారు. ఓ బస్సుపై జరిగిన ఈ దాడిలో సుమారు 48 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటన 2025లో ఇప్పటివరకు జరిగిన దాడుల్లో అత్యంత ఘోరమైనదిగా గుర్తించబడింది. జనవరి నుండి జూన్ వరకు BLA మొత్తం 286 దాడులు జరిపిందని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఈ దాడుల్లో బాంబు పేలుళ్లు, ప్రత్యేక ఆపరేషన్లు, మరియు మూడు ఫిదాయీన్ స్టైల్ ఆత్మాహుతి దాడులు ఉన్నట్లు తెలుస్తోంది.
గణాంకాల ప్రకారం:
-
మరణించిన పాక్ సైనికులు: 697
-
బీఎల్ఏ మరణాలు: 36 (అందులో 7 మంది ఆత్మాహుతి దళాలు)
-
పాక్ సైన్యం అరెస్ట్ చేసిన వారు: 290
-
తగులబెట్టిన వాహనాలు: 133
-
ధ్వంసమైన సైనిక స్థావరాలు: 17
-
హైజాక్ చేసిన రైలు: 1
-
ఆక్రమించిన ఆయుధ రకాల సంఖ్య: 115+
బీఎల్ఏ ఈ దాడుల ద్వారా పాక్ సరఫరా మార్గాలు, కమ్యూనికేషన్ లింకులు, సైనిక లాజిస్టిక్స్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని, ప్రభుత్వ నిర్వహణను బలహీనపరిచే ప్రయత్నంలో ఉంది. ఇది కేవలం దాడి కాదు – వ్యూహాత్మకంగా ప్రణాళికాబద్ధంగా సాగుతున్న ఉద్యమం అని విశ్లేషకులు అంటున్నారు.
ఈ ఆరు నెలల కాలంలో బీఎల్ఏ కనీసం 45 కీలక భూభాగాలను పాక్ ఆక్రమణ నుండి విడదీయగలిగిందని దాని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రకటించాయి. ఇదే సమయంలో పాక్ ప్రభుత్వం ఈ దాడుల తీవ్రతను బయటకు రానివ్వకుండా నిరోధించేందుకు ప్రయత్నిస్తోంది.
️ బీఎల్ఏ కొత్త వ్యూహం
ఈ ఏడాది ప్రారంభంలో BLA తన అనుబంధ గ్రూపులను కలిపి ఒకటిగా మారుస్తూ, కొత్త పోరాట వ్యూహాన్ని ప్రకటించింది. ఈ చర్యతో తమ పోరాటం మరింత సవ్యంగా సాగుతుందని వారు తెలిపారు.

Acer Aspire Lite – Thin & Light Laptop!
✨ 13th Gen Intel Core i3
⚡ 8GB RAM | 512GB SSD
️ 15.6” Full HD డిస్‌ప్లే
మేటల్ బాడీ | 1.59 కిలోల తేలిక
Windows 11 Home
36 WHR బ్యాటరీ
ధర: ₹30,790 మాత్రమే!
(MRP ₹51,000 – 40% OFF )
స్టైలిష్ & ప్రీమియమ్ లుక్ – స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్‌కు బెస్ట్!
ఇప్పుడే బుక్ చేసుకోండి – https://amzn.to/3Ugc69L లింక్ పై క్లిక్ చేయండి..
