Bc Dharna” శంకరపట్నం డిసీ ప్రతినిధి
స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా, ఉద్యోగ ఉపాధి కల్పన రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నిరసన ధర్నా కార్యక్రమం విజయవంతమైంది. ఈ ధర్నాకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల వారీగా బీసీ నాయకులు భారీగా ఢిల్లీకి తరలి వచ్చారు.మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆ నియోజకవర్గం నుంచి బీసీ నాయకులు హాజరయ్యారు. కోమటిరెడ్డి పద్మారెడ్డితోపాటు పోతుగంటి శ్రీనివాస్, తమ్మనవేణి రాముల యాదవ్, కానిగంటి మల్లికార్జున్, బుర్ర తిరుపతి గౌడ్, వాసాల తిరుపతి, గోపి తదితరులు పాల్గొన్నారు.

అమెజాన్లో కొనేందుకు లింక్ పై క్లిక్ చేయండి.. https://amzn.to/45mPglW
