గ్రూప్ వన్ ఫైనల్ కీ విడుదల
డీసీ తెలుగుః టీఎస్పీఎస్సీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రూప్ 1 ఫైనల్ కీ ని మంగళవారం రాత్రి విడుదల చేశారు. ఆ కీని వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచారు. ఈ నేపథ్యంలో తుది ఫలితాలు త్వరలో వెల్లడవునున్నాయి. గత ఏడాది అక్టోబర్ లో నిర్వహించి 1ః50 చొప్పున అభ్యర్థులను కూడా ఎంపిక చేశారు. కానీ పేపర్ల లీకేజీ కారణంగా ఆ పరీక్షను రద్దు చేశారు. ఈ ఏడాది జూన్ 11న గ్రూప్ 1 మళ్లీ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. తుది ఫలితాల్లో 503 పోస్టులకు గానూ 25,150 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నారు.