Congress Leaders Press Meet” బీఆర్‌ఎస్ ప్రభుత్వ హ‌యంలో అనర్హులకు ఆసరా పింఛన్లు శ్రీనివాస్ గౌడ్ ఆరోపణ

Congress Press Meet”  ప్రజా ప్రభుత్వంలో పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక: కాంగ్రెస్ నేతల హామీ

శంకరపట్నం డీసీ ప్ర‌తినిధి :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అనర్హులకూ ఆసరా పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు అందించారని టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. సోమవారం మానకొండూర్ నియోజకవర్గంలోని శంకరపట్నం మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. “బీఆర్ఎస్ హయాంలో కొంతమంది నాయకులు డబ్బులు దండుకొని అనర్హులకూ సంక్షేమ పథకాలు అందించారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం లో మాత్రం ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేద‌న్నారు.

అర్హుల ఎంపికలో అధికారులే లబ్ధిదారుల జాబితా తయారు చేస్తున్నారని, ఆ ప్రక్రియలో నాయకుల ప్ర‌మేయం లేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, అర్హులైన వారికి తెలుపు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం వంటి పథకాలు అమలవుతున్నాయని చెప్పారు.

బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజల ఆశీర్వాదంతో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంన్నారు. ప్రజలకు మేలు చేసే పథకాలను ప్రజలు స్వీకరిస్తుండటంతో, అసహనం చెందిన బీఆర్ఎస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

ఈ సమావేశంలో హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి, కొత్తగట్టు మచ్చ గిరింద్రస్వామి దేవస్థానం చైర్మన్ ఉప్పుగల మల్లారెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి బండారి తిరుపతి, మాజీ సర్పంచ్ తుమ్మేటి రాజిరెడ్డి, కేశవపట్నం గ్రామ శాఖ అధ్యక్షుడు మొ. లంగూరి సదానందం, తదితరులు పాల్గొన్నారు.

క‌రీంన‌గ‌ర్ వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

Right laptop” డిజిట‌ల్ యుగంలో సరైన ల్యాప్‌టాప్ ఎంపిక చేసుకోవడం ఎలా? — ప్రతి ఒక్క‌రూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *