Mp nidhulu” శంకరపట్నం డిసి ప్రతినిధి:
కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని శంకరపట్నం మండలం కరీంపేట గ్రామంలో తాగునీటి అవసరాల కోసం కొత్త బోరు బావిని మంజూరు చేశారు. ఈ బోరుబావి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎంపీ నిధులతో మంజూరయ్యింది.
ఈ విషయాన్ని బీజేపీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ సోమవారం తెలిపారు. గ్రామస్థుల విన్నపాన్ని స్వీకరించిన ఎంపీ బండి సంజయ్ తక్షణమే స్పందించి బోరుబావి మంజూరు చేశారు. ఈ సందర్భంగా పూజలు నిర్వహించి బోరు వేయించారు.
ఈ కార్యక్రమంలో మాజి ఎంపిటీసి గాండ్ల తిరుపతి, కో-ఆప్షన్ సభ్యులు మహమ్మద్ ఖాజాపాషా, మాజి వార్డు సభ్యులు చింతం రాజేశం, శక్తి కేంద్రం ఇంచార్జి రాసమాల్ల శ్రీనివాస్, బిజెపి నాయకులు, అంబేద్కర్ సంఘం సభ్యులు సహా పలువురు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.
