Tuesday , 25 June 2024
Breaking News

గోడ దుంకుడే

అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిక‌ల హ‌డావిడి మొద‌లైంది. మూడు ప్ర‌ధాన పార్టీల ముఖ్య నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ప్ర‌జ‌ల‌కు చేరువుతున్నారు. దాదాపు మూడు నెల‌ల ముందేగానే అనూహ్యంగా బీఆర్ ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు ఎన్నిక‌ల్లో నిల‌బ‌డే అభ్య‌ర్థుల జాబితా ప్ర‌క‌టించారు. ఇదీ కేసీఆర్ వ్యూహంలో భాగ‌మేన‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఆ వ్యూహాన్ని అందుకోవ‌డమే ప్ర‌తిపక్షాల అస‌లు టాస్క్. దీంతో బీఆర్ ఎస్ అభ్య‌ర్థుల‌ను ఢీ కొట్టి గెలువ‌గ‌లిగే స‌త్తా క‌లిగిన నాయ‌కుల కోసం బీజేపీ, కాంగ్రెస్ పావులు కదుపుతున్నాయి. దీంతో పాటు బీఆర్ ఎస్‌లో టిక్కెట్టు ఆశించి భంగ‌ప‌డ్డ ప్ర‌జా బ‌లం ఉన్న నాయ‌కులను లాగేసుకునేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. బీఆర్‌ఎస్‌ను నుంచి వెళ్తున్న వారు కొంద‌రు కాగా. మ‌రికొంద‌రు పార్టీలోనే ఉంటూ లోలోప‌ల ర‌గిలిపోతున్నా వారూ ఉన్నారు. కొంత‌మంది ఇప్పటికే బీజేపీ రాజీనామా చేశారు. ఇంకొంద‌రు ఆలోచ‌న‌లు ప‌డ్డారు. రాజీనామా వైపు కూడా మొగ్గు చూపొచ్చు. ఈక్ర‌మంలో బీఆర్‌ఎస్‌లోని అసంతృప్తి నాయ‌కుల‌ను సంతృప్తి ప‌రిచే వేదిక‌లుగా బిజెపి, కాంగ్రెస్‌లు మారబోతున్నాయి. సాధ్య‌మైనంత ఎక్కువ మందిని లాగేసుకోవాల‌ని ఈ రెండు పార్టీలు భావిస్తున్నాయి. బీఆర్ ఎస్‌లోని అసంతృప్తి నాయ‌కులను పార్టీ వీడ‌కుండా బీఆర్ ఎస్ అధిష్టానం చ‌ర్య‌లు తీసుకుంటుంది. వారు ప్రతిపక్ష పార్టీలకు వెళ్తే… ప్రత్యర్థులు బలపడే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. బీఆర్ ఎస్‌లో 7 గురి టిక్కెట్లు రాలేదు. ఇందులో ఖానాపూర్ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రేఖా నాయక్‌ కాంగ్రెస్‌ పార్టీ లో చేరేందుకు సిద్ద‌మ‌వుతున్న‌ట్టు స‌మాచారం. మ‌రో వైపు నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బిఆర్‌ఎస్ కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడంతో పాటు తన అనుచరులతో ఇంకొక పార్టీలో చేరడానికి సిద్ద‌మ‌వుతున్నారు. వేముల వీరేశం 2024 అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్‌ టికెట్‌ ఆశించిన‌ప్ప‌టికీ మొన్న ప్ర‌క‌టించిన టిస్టులో ఆయ‌న అసంతృప్తికి గుర‌య్యారు. కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన వేముల మరో పది రోజుల్లో కార్యకర్తలతో చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తాన‌ని చెప్పారు. వేముల హస్తం గూటికి చేరడం ఖాయమని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. నకిరేకల్‌ ఎమ్మెల్యే టికెట్‌ను సిఎం కెసిఆర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు కేటాయించారు.
అదే బాట‌లో కేసీఆర్‌ ఆదేశాలతో తుమ్మల ఇంటికి ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్‌రావు, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు వెళ్లారు. బీఆర్‌ఎస్‌లోనే కొనసాగాలని తుమ్మలను బుజ్జగించారు. కేసీఆర్‌ త్వరలోనే సముచిత స్థానం కల్పిస్తారని, తొందరపడి పార్టీని వీడొద్దని కోరారు. స్టేష‌న్ ఘ‌న్ పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్య‌మంత్రి తాటి కొండ రాజయ్యను బుజ్జగించడానికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి రంగంలోకి దిగారు. అసంతృప్తులను బుజ్జగించే పనిలో కేసీఆర్‌ ఉంటే… ఎలాగైనా వారిని తమ పార్టీల్లోకి లాక్కునేందుకు కాంగ్రెస్ , బీజేపీలు గాలం వేస్తున్నాయి. జలగం వెంకట్రావు కొత్తగూడెం టికెట్‌ ఆశించినా లాభం లేక‌పోవ‌డంతో ఆయ‌న సైతం పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. భార‌త రాష్ట్ర స‌మితి కి రాజీనామా చేయాలనుకునే వారంతా… కాంగ్రెస్‌, బీజేపీతో సంప్రదింపులు చేస్తున్నారని వినికిడి. త్వరలోనే భారీగా చేరికలు ఉంటాయని గాందీభవన్‌ వర్గాలు చెప్తున్నాయి. ఆగ‌స్టు 26న చేవెళ్లలో నిర్వ‌హించ‌బోయే సభలో నాయకులను చేర్చుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. బీజేపీ కూడా చేరిక‌ల దృష్టి పెట్టింది. కానీ పెద్ద‌గా ఉప‌యోగం లేకుండా పోతోంది. ఆ మ‌ధ్య‌న జ‌య‌సుధ మిన‌హా మ‌రెవ‌రు ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీ లో చేర‌లేదు. చూడాలి రాబోయే మూడు నెల‌ల్లో ఏం జ‌రుగుతుందో..

About Dc Telugu

Check Also

Viral video

Viral video” స‌ముద్రంలో ఇరుక్కున్న థార్స్‌… రీల్స్ కోస‌మేనా..?  వైర‌ల్ వీడియో

Viral video” ఈ మ‌ధ్య యువ‌త రీల్స్ కోసం ఎంత‌టి సాహసాలకైనా వెనుకాడ‌డం లేదు. మొన్న పూణేలోని ఓ ఎత్త‌యిన …

Video viral

Video viral” ఇదేం స్టంట్‌రా నాయనా… నెత్తిమీద గ్యాస్ సిలిండ‌ర్లు.. వీడియో వైర‌ల్

Video viral” రీల్స్ చేయ‌డం… ఫేమ‌స్ అవ‌డం.. ఇదే ఇప్పుడు న‌డుస్తున్న ట్రెండ్‌.. సాధార‌ణంగా కొన్ని ప‌నులు చేయ‌డానికి కొంత …

tribal women

tribal women” ఆదివాసి మ‌హిళ‌పై దాడి ఘ‌ట‌న‌లో ఆర్థిక సాయం ప్ర‌కటించిన మంత్రి జూప‌ల్లి

tribal women” నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండ‌లం మొలచింత‌లప‌ల్లి ఆదివాసీ మ‌హిళ‌పై దారుణంగా దాడికి పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com