Madaleshwara Swamy” శ్రీ మడలేశ్వర స్వామికి రజక సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

Madaleshwara Swamy” శంకరపట్నం, డిసి ప్రతినిధి:
కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామంలో, రజక కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ మడలేశ్వర స్వామికి  గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించగా, నూతనంగా ప్రతిష్టించబడిన మల్లేశ్వర స్వామి విగ్రహానికి పూజలు చేయడం విశేషం.

ఈ సందర్భంగా రజక సంఘం మానకొండూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి నాంపల్లి శంకరయ్య రజక మాట్లాడుతూ..ఇది రజక కులస్తుల ఆధ్యాత్మిక అభిమానం మరియు సమైక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. ఆలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని మండల, గ్రామ స్థాయి రజక సంఘాల నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల రజక సంఘం అధ్యక్షుడు తాడిచెర్ల తిరుపతి, గ్రామ రజక సంఘం అధ్యక్షుడు నాంపల్లి వెంకటేష్, నాయకులు రాస మల్ల శ్రీనివాస్, నాంపల్లి సంపత్, బండి మల్లయ్య, రాస మల్ల అనిల్, కల్లేపల్లి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *