శంకరపట్నం డిసి ప్రతినిధి..
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం, శంకరపట్నం మండలం కరీంపేట గ్రామానికి చెందిన శ్రీ భక్తాంజనేయ భజన మండలికి ప్రత్యేక స్థానం దక్కింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కళాభారతిలో బుధవారం జరిగిన ఆధ్యాత్మిక భజన కార్యక్రమంలో 50కు పైగా భజన మండలి గ్రూపుల నుంచి 1044 మంది పాల్గొని 10 గంటలపాటు నిర్విరామంగా భజన గీతాలు ఆలపించారు. ఈ ప్రత్యేక కార్యక్రమం వండర్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదు అయింది.
కరీంపేట భజన మండలి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో వారి పేర్లు కూడా రికార్డులో చోటు దక్కించుకున్నాయి. ఈ సందర్భంగా స్టేట్ కోఆర్డినేటర్ నరెందర్ గౌడ్ బుధవారం రాత్రి కళాభారతిలో సభ్యులకు పత్రాలు అందజేశారు. ఈ ఘనతకు గ్రామస్తులు, మండల ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.
అలాగే, కేశవపట్నం శ్రీ శివకేశవ, ఎరడపల్లి శ్రీ రామానంద, కన్నపూర్ శివరామకృష్ణ భజన మండలి సభ్యులూ వండర్ బుక్ రికార్డులో చోటు దక్కించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆడెపు శ్రీనివాస్, సంబు శ్రీనివాస్, గంపల బాలారాజు, రాసమల్ల శ్రీనివాస్, మెడిశెల్మల శ్రీనివాస్, ఏగుర్ల సంపత్, మెరుగు రాజు, గోపి శ్రీనివాస్, సంబు తిరుపతి, వనపర్తి ప్రశాంత్, మంతెన శ్రీనివాస్, ఆరె వీరయ్య, బొజ్జ లింగస్వామి, ఆడపు బాలరాజు, సంబు రవి, తీర్థాల మహేష్, ఎనుగుల భీరయ్య తదితరులు పాల్గొన్నారు.

FLAIR Clixx Mechanical Pencils – మీ డ్రాయింగ్ కు స్నేహితులు! ✏️
0.7 mm మిడియం లీడ్‌తో
రిలాక్స్ అయ్యి డ్రా చేయడానికి ట్రయాంగ్యులర్ బ్యారెల్
తేలికపాటి, సౌకర్యవంతమైన గ్రిప్
ప్రతి పెన్సిల్‌తో ఉచితంగా లీడ్ ట్యూబ్ ఒకటి
ప్యాక్ లో 10 పెన్సిల్స్!
మీ క్రియేటివిటీకి, మీ చేతికి నమ్మకమైన తోడుగా FLAIR Clixx!
అమెజాన్‌లో కొనుగోలు కోసం https://amzn.to/4lJPxX2 లింక్ పై క్లిక్ చేయండి.
