Chalo hyderbad” ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి రాజు మాదిగ..
శంకరపట్నం : డిసీ ప్రతినిధి
ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంద కృష్ణ మాదిగ బుధవారం పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కనుకుంట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో రాజు మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో,తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మార్పీఎస్ పోరాటంతో అనేక సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టి అందజేస్తున్నాయని, ఎమ్మార్పీఎస్ పోరాట ఫలితంగానే వికలాంగుల, ఆసరా పెన్షన్ అమలైందని, 20 23 సంవత్సరములో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్రంలోని వికలాంగులకు, ఆసరా పెన్షన్ దారులకు పెన్షన్ను పెంచి అందజేస్తామని రెండు సంవత్సరాలు కావస్తున్న నేటికీ పెన్షన్ పెంచి అందజేయడం లేదని, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 3 న హైదరాబాద్ పట్టణంలో పెన్షన్ పెంపుకై మహా గర్జన సభను నిర్వహించడం జరుగుతుందని, ఈ మహా గర్జన సభకు జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో హాజరై మహాసభను విజయవంతం చేయాలని రాజు మాదిగ కోరారు. ఈ సమావేశంలో మండల అధక్షుడు శ్రీనివాస్ మాదిగ, మండల ఇంచార్జ్ అంబాల మధురయ్య మాదిగ,ఎంఎస్పి మండల అధ్యక్షుడు కలకోట సమ్మయ్య మాదిగ, శంకర్ మాదిగ, సీనియర్ నాయకులు మేకల కుమార్ మాదిగ, మాతంగి నరేష్ మాదిగ, బొజ్జ చంద్రమౌళి మాదిగ, బొజ్జ లింగస్వామి, మాతంగి నరేష్ మాదిగ, మోరే రాకేష్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.
Chalo hyderbad” చలో హైదరాబాద్ విజయవంతం చేయాలి…
