Ci Venkat” ఉన్నత చదువులే లక్ష్యంగా ముందుకు సాగాలి..
రూరల్ సీఐ వెంకట్…
శంకరపట్నం: డిసి ప్రతినిధి
మత్తు పదార్థాలను అరికట్టు ప్రతి ఒక్కరి బాధ్యత, విద్యార్థులు ఉన్నత చదువులే లక్ష్యంగా ముందుకు సాగి ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలను సాధించి బంగారు భవిష్యత్తు కు బాటలు వేసుకోవాలని హుజురాబాద్ రూరల్ సిఐ పులి వెంకట అన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం ,శంకరపట్నం మండలం కేశవపట్నం ఎస్ఐ కట్కూరి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మోడల్ స్కూల్, కేశవపట్నం రైతు వేదికలో మత్తు పదార్థాల నివారణ కోసం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన హుజురాబాద్ రూరల్ సిఐ పులి వెంకట్ మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థులు, యువత ఉన్నత చదువులే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలను సాధించి, కన్న తల్లిదండ్రుల కలలను సాకారం చేసి, ఉన్నతమైన స్థానంలో నిలిచి సమాజంలో గౌరవాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల నడవడికను ఎప్పటికప్పుడు గమనిస్తూ, పిల్లల దినచర్యలో తల్లిదండ్రులు నిత్యం భాగస్వాములై విద్యా బోధనల పట్ల, ప్రత్యేక శ్రద్ధ చూపే విధంగా తల్లిదండ్రులు విద్యార్థుల నడవికను గమనిస్తూ సన్మార్గం వైపే తమ పిల్లలు పయనించేలా తల్లిదండ్రులు నిఘా నేత్రాలను, తమ పిల్లలపై పెట్టి, పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలన్నారు. నేటి సమాజంలో విద్యార్థులు, యువత మొబైల్ ఫోన్ల వాడకంతో తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవడం జరుగుతుందని, విద్యార్థులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి చదివే లక్ష్యంగా చదువుపై దృష్టి పెట్టి, ఉన్నత చదువులే లక్ష్యంగా ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కేశవపట్నం ఎస్ఐ కట్కూరి శేఖర్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ సరిత, మాజీ జెడ్పిటిసి, టిపిసిసి సభ్యులు బత్తిని శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్, హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు కవ్వ పద్మ శ్రీనివాసరెడ్డి, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు చింతి రెడ్డి పద్మ, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆడెపు అజయ్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మొహమ్మద్ షారుక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గట్టు తిరుపతి గౌడ్, జిల్లా కార్యదర్శి బండారి తిరుపతి, మచ్చ గిరింద్ర స్వామి మాజీ చైర్మన్ ఉప్పుగల మల్లారెడ్డి, కన్నాపూర్ మాజీ సర్పంచ్ తాటికొండ సదానంద చారి, రాజాపూర్ తాజా మాజీ ఉపసర్పంచ్ కుర్రె ఓదెలు, నాయకులు తిరుపతి గౌడ్, సంపత్, గండికోట రవి, వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Ci Venkat” మత్తు పదార్థాలను అరికట్టటం ప్రతి ఒక్కరి బాధ్యత…
