కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్ గా చిత్ర మిశ్రా

కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న పమేలా సత్పతిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం, కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్ గా చిత్ర మిశ్రాను నియమించారు. ప్రస్తుతం ఆమె ITDA ఏటూరునాగారంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. నూతన కలెక్టర్ చిత్ర మిశ్రా రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు.

 చిత్ర మిశ్రా…                                                      పమేలా సత్పతి

కరీంనగర్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ గా విధులు నిర్వహిస్తున్న పమేలా సత్పతి, IAS (2015) బదిలీ అయ్యారు. ఆమెను కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్ (Spl. Commissioner, Labour) గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటివరకు కార్మిక శాఖ కమిషనర్ గా అదనపు బాధ్యతలు (FAC) నిర్వర్తిస్తున్న శ్రీ ఎం. దాన కిషోర్, IAS (1996) ను ఆ బాధ్యతల నుండి విముక్తం చేస్తూ పమేలా సత్పతిని ఈ పదవిలో నియమించారు.

రాష్ట్ర వ్యాప్తంగా బ‌ద‌లీ అయిన క‌లెక్ట‌ర్లు వివ‌రాలు

G.O.290 – IAS Transfers & Postings

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *