అభివృద్ధిని ఆదరించండి
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
కాంగ్రెస్కు ఓటు వేస్తే తెలంగాణను చీకటి చేస్తారని, అభివృద్ధిని ఆదరించాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. గట్టుభూత్కూర్, హిమ్మత్ నగర్, చిన్న ఆచంపల్లి, ఆచంపల్లి, మల్లాపూర్, గోపాల్రావుపల్లి, వెంకంపల్లి, కాసారం గ్రామాల్లో శుక్రవారం ఆయన ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని, బీజేపీకి ఓటు వేస్తే పెట్టుబడిదారుల చేతిలో పెడతారన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో అన్నివర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేలా ఉందని, నవంబర్ 30న జరగనున్న ఎన్నికల్లో తనను ఆదరించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సతీమణి ప్రచారం
గంగాధర, బూరుగుపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సతీమణి దీవెన శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గంగాధర మండల కేంద్రంలోని బీడీల ఫ్యాక్టరీ, బూరుగుపల్లిలో ఇంటింటికీ తిరుగుతూ తన భర్తకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు బీఆర్ఎస్ వెంటే ఉన్నారని, అభివృద్ధి, సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
లారీ టైర్ పేలి యువకుడు మృతి… గాలి నింపుతుండగా ఘటన
గోరంట్ల నుంచి కర్ణాటక వెళ్తుండగా రోడ్డు ప్రమాదం 12 మంది దుర్మరణం