ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. మరో సారి బీఆర్ ఎస్ అధికారంలోకి రాగానే ఫిట్‌నెస్, చార్జీలు, సర్టిఫికెట్ జారీలను మాఫీ చేస్తామని ప్రకటించారు.
కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు నియోజకవర్గంలో సోమవారం బీఆర్ ఎస్ ప్రజా ఆశీర్వద సభ నిర్వహించారు. ఈ సదర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణాలో ప్రతి ఒక్కరికి సహాయం చేశామని చెప్పారు. ట్రాఫిక్ పోలీసులు శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటరు. అందుకోసమే వారికి 30 శాతం అలవెన్స్‌లు ఇస్తున్నామని చెప్పారు. హోం గార్డులకు దేశంలోనే అత్యధిక వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి మోడీ విపరీతంగా డిజిల్ ధరలు పెంచేటట్టు చేసిండు. ఆటో రిక్షా కార్మికుల దగ్గర ముక్కుపిండి ట్యాక్స్ వసూలు చేస్తున్నారని విమర్శించారు. మరోసారి బీఆర్ ఎస్ గవర్నమెంట్ రాగానే అన్నిపన్నులు రద్దు చేస్తామని తెలిపారు.
పెండ్లి భోజనంలో రసగుల్లాలు పెట్టలేదని కర్రలతో కొట్లాట..
ఇంత అహమా.. వరల్డ్ కప్ పై కాళ్లు పెట్టిన ఆసీస్ క్రికెటర్లు.. 2007లోనూ ఇంతే
భారత్ భూ భాగంపై ఎగిరిన వింత వస్తువు.. ఫ్లయింగ్ సాసర్..?